ఇవే ఆంధ్ర హైకోర్టు, ఐటి టవర్ డిజైన్లు, మీ చాయిస్ చెప్పండి

ఆన్ లైన్లో ఉంచిన ఏపీ ప్రభుత్వం
ఎక్కువ మందికి నచ్చిన డిజైన్ ఖరారవుతుందిః

మునిసిపల్ మంత్రి పి నారాయణ

హైకోర్టు  గ్రాఫిక్ డిజైన్లు

మరిన్ని నమూనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శాశ్వత సిటీ కోర్టు, ఐటీ టవర్ నిర్మాణాలకు డిజైన్లు సిద్ధం అయ్యాయి. వీటిని పరిశీలించిన చంద్రబాబు, ప్రజల అభిప్రాయాన్ని సేకరించి తుది డిజైన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. రూ. రూ.372 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణానికి సీఎం అనుమతి ఇచ్చారు. అత్యధికులు ఎంపిక చేసిన డిజైన్లను ఒకే చేసి, టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

సీఆర్డీఏ పరిధిలో వెయ్యి అపార్టుమెంట్లను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, ప్రజలకు విక్రయించనుందన్నారు. ఈ సమావేశంలో సిటీ కోర్టు నిర్మాణానికి 12 డిజైన్లు, ఐటీ టవర్ కోసం 19 డిజైన్లను సిద్ధం చేశామని చెప్పారు. ఈ నెల 22 నుంచి వీటిని ఆన్ లైన్ లో చూసుకోవచ్చని, ఇప్పటివరకూ దాదాపు 3 వేల మందికి పైగా వీటిని చూశారని, మరో రెండు రోజులు వీటిని తిలకించవచ్చని తెలిపారు.ఆపై ఎక్కువ మందికి నచ్చిన డిజైన్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి, తుది మోడల్ ను ఖరారు చేస్తామని నారాయణ తెలిపారు.

ఐటి టవర్ నమూనాలు

వెబ్ సైట్ ఇదే

అమరావతి రాజధాని పరిధిలో వేగవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లను సొంతంగా నిర్మించనుందని ఆయన తెలిపారు. ఈ అపార్టుమెంట్లను 2, 3 బెడ్ రూమ్ లుగా నిర్మిస్తామని, ఆపై ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామన్నారు. వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణంతో పాటే అక్కడే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మార్కెట్ ఏర్పాటవుతాయన్నారు. నయా రాయపూర్, గాంధీనగర్, చండీఘడ్ రాజధాని నిర్మాణ సమయంలో అక్కడి ప్రభుత్వాలు ఇటువంటి ఫార్ములానే పాటించాయని ఆయన గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం చేపట్టిన 3,840 అపార్టుమెంట్లనిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. విజయవాడలో ఉన్న కాలువల పక్కన చేపట్టిన గ్రీనరీని రెండు నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని నారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *