కడుపు రగిలి రోడ్డెక్కిన తెలంగాణ జర్నలిస్టులు

అవును… తెలంగాణ జర్నలిస్టులు పోరుబాట పట్టారు. రోడ్డెక్కి దీక్ష చేశారు. గొంతెత్తి నినదించారు. ఇంతకాలం తెలంగాణ జర్నలిస్టులు సర్కారు మాటలు నమ్ముతూ వచ్చారు. కానీ గడిచిన నాలుగేళ్లలో సర్కారు తమను పట్టించుకోలేదన్న ఆవేదనతో రోడ్డెక్కారు. నిరహార దీక్షకు దిగారు. జర్నలిస్టుల సమస్యలపై సర్కారు మాటలకే పరిమితం అయిందని ఆగ్రహించారు.

మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్టులు నిరహారదీక్షకు దిగారు. మహబూబాబాద్  పట్టణంలోని అమర వీరుల స్థూపం వద్ద ఈ దీక్షా కార్యక్రమం జరిగింది. తెలంగాణలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్టలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లోని అమరవీరుల స్తూపం ముందు జర్నలిస్ట్ ల నిరాహారదీక్షకు దిగడంతో జర్నలిస్టు వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

టియుడబ్ల్యూజె (ఐజెయు) ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షా కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా నేతలు ఆవుల యుగేందర్, కల్లూరి ప్రభాకర్, మట్టూరి నాగేశ్వరరావు, సదాశివుడు, డివై గిరి తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే తక్షణమే జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మరో జర్నలిస్టు సంఘం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (143) నాయకులు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. తక్షణమే జర్నలిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవీందర్ రెడ్డి, జలగం శేఖర్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *