తెలంగాణ బడ్జెట్ మూడు ముక్కల్లో…

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఈ  ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో ఆర్థిక మంత్రి మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

 

తెలంగాణ ఏర్పాటుకు ముందు 4.2శాతం ఉన్న జీఎస్‌డీపీ ఇపుడు అంటే 2018-19లో 10.5శాతానికి పెరిగిందని ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని చెబుతూ మూలధన వ్యయంలో దేశంలో అగ్రగామిగా ఉందని ఆయన చెప్పారు.
నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదని ఇపుడు 16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని ముఖ్యమంత్రి  అన్నారు.
మూలధనం వ్యవయంలో కేంద్రానిది కేవలం 12.8 శాతం అని గత ఐదేళ్లలో మూలధనం కింద రూ.1,65, 167 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో సగటు ఆదాయ వృద్ధి 21.49 శాతం పెరిగిందని చెబుతూ నాణ్యమైన విద్యుత్‌ 24 గంటల పాటు ఇస్తున్నామని ఆయన చెప్పారు.
ఇవీ హైలైట్స్
-6.3 శాతం అదనపు వద్ధి రేటు .
-వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు నమోదు .
-ఐదేళ్లలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు అయింది.
-నిధులు ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.
-ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం 6 రెట్లు పెరిగింది.
-మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం.
-వందలాది గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోంది.
-భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుట పడింది.
-తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది.
-దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది.
-ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించాం.
-వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది.
-2013-14లో జీఎస్‌డీపీ విలువ రూ. 4,51,581 కోట్లు
-దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది.
-వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి.
-రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది.
-దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా పడింది.
బడ్జెట్ కేటాయింపులు
* రైతుబందుకు 12వేల కోట్లు.
* రైతు భీమా కోసం 1137 కోట్లు.
* పంటల రుణమాఫీ కోసం 6 వేల కోట్లు.
* విద్యుత్ సబ్సిడీల కోసం 8వేల కోట్లు.
* ఆసరా పెన్షన్ల కోసం 9, 402 కోట్లు.
* గ్రామ పంచాయతీలకు 2,714 కోట్లు
* మున్సిపాలిటీ లకు 1,764 కోట్లు కేటాయింపు.
* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదటి ఏడాది నెలకు 6,247 కోట్లు ఖర్చు పెడితే…ప్రస్తుతం 11, 305 కోట్లు ఖర్చు పెడుతుంది.
* 2018-19 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర జీఎస్డీసి వృద్ధిరేటు రెండున్నర రేట్లకు పెరిగి 10.5 శాతం నమోదు.
* 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్రీయ దేశయోత్పత్తి విలువ 4, 51, 580 కోట్లు ఉంటే. 2018-19 నాటికి రాష్ట్ర సంపద 8, 65, 688 కోట్లు నమోదు.