Home News గోపలాయపల్లిలో జనాలను బోల్తా కొట్టించిన బురిడి స్వామీజీ

గోపలాయపల్లిలో జనాలను బోల్తా కొట్టించిన బురిడి స్వామీజీ

107
0
SHARE

దేవుడు పాలు తాగుతున్నాడు అంటే బారులు తీరి పాలు పోయడం మనం చూశాము, చెట్ల నుండి పాలు నీళ్లు కారుతున్నాయంటే వేలం వెరీగా వెళ్లి చూసిన మహా భక్తులు ఉన్నారు, ఏకంగా ఓ స్వామిజి ఇచ్చిన పిలుపుతో కొన్ని 2 లక్షలకు పైగా జనాలు ఒక్క చోటుకు చేరుకోవడం ఏ రోజు నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద చోటు చేసుకోవడం మనం చూస్తున్నం అసలు ఏం జరిగింది ఆ పిలుపు ఇచ్చిన స్వామిజీ ఎవరూ?అసలు ఎందుకు ఆ పిలుపు ఇవ్వవలసి వచ్చింది? దాని వెనుక ఉన్న మాయ మంత్రం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త మొత్తం చదవాల్సిందే….

ప్రముఖ టీవీ న్యూస్ ఛానెల్స్ అన్నింటిలో ప్రతిరోజు ఏదో ఒక్క సమయంలో ఇది చేయండి, అధి చేయండి అనీ ఒక్క చిన్న వయస్సులో ఉన్న ఒక్క స్వామి రూపంలో ఉన్న వ్వక్తి మాటలు సగటు టీవీ చూసే ప్రక్షకులందరికి తెలుసు అతనే హైదరాబాద్ లో ఉన్న మారుతి జ్యోతిష్యాలయం లక్ష్మీకాంత శర్మ,ఇతనికి స్వామిజిగా కూడా మంచి  పేరుంది.  మార్చి 6 అమావాస్య రోజు నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి సమీపంలో ఉన్న గోపలాయపల్లిలో ఉన్న వేణుగోపాల స్వామి పై సూర్య కిరణాలు పడుతాయని,ఆ సమయంలో స్వామి దర్శనం చేసుకుంటే అంతా శుభమే కలుగుతుందని ఆ స్వామి ఓ ఛానెల్ లో చెప్పడంతో పట్టు అదే రోజున తాను అక్కడ యాగం చేస్తానని తెలియజేసారు,శర్మ గారు…

దీంతో  ఇది నిజమని నమ్మిన ప్రజలు  భక్తులు తండోపతండాలుగా అక్కడికి తరలి వచ్చారు… వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఇది ఇలా ఉంటే అక్కడ స్వామి పై సూర్య కిరణాలే పడలేదు. ఇది 89 సంవత్సరాలకొకసారి వస్తుందని డబ్బా కొట్టడంతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు అధికంగా రావడంతో రోడ్లు మొత్తం జన సంద్రంగా మారిపోయాయి రోడ్ల మీద వాహనాలు నిలిచి పోయాయి.

ఈ విషయమై అసలు ఎందుకు ఇంత మంది జనాలు ఇలా ఒక్క సరి  వచ్చారని నల్లగొండ  ఎస్పీ రంగనాథ్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించడం తో అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది… నార్కట్ పల్లి, గోపలాయపల్లి ఏరియాలో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు. దీంతో  ఇక్కడి ప్రాంతం తొందరగా డెవలప్ కావాలంటే ఈ విధంగా చేస్తే గిరాకి రావడంతో పాటు చేసిన ప్లాట్లు మొత్తం అయిపోతయని ప్లాన్ వేసి స్వామిజిని సంప్రదించినట్టు ఉన్నత వర్గాల నుండి తెలుస్తోంది.

స్వామిజీ టీవీలో చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాల్ డేటా ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది . ప్రజలు ఇలాంటి స్వామిజీలు చెప్పున మాటలు నమ్మి  మోస పోవద్దు అని ఎస్పీ రంగనాథ్ ఇక్కడ మీడియా వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రజలంతా క్షేమంగా తమ స్థలాలకు వెళ్లి పోవాలని,స్వామిజి పై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామనీ పోలీసులు తెలిపారు.

మొత్తానికి ప్రజలను ‘రియల్ ‘ఫుల్స్ చేశారా అనే అనుమానం తో నార్కట్ పల్లి పోదాం అనుకోని పోలేని వాళ్ళు ఇది చూసి లోలోపల తెగ నవ్వుకుంటున్నారు.

(వినయ్ కోసిక, జర్నలిస్టు)