‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై రాంగోపాల్ వర్మకు సుప్రీమ్ కోర్ట్ ఝలక్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకు వైసీపీ నేత ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం రాజకీయ దుమారానికి తెరతీసింది. ఈ సినిమాను టీడీపీ వర్గాలు ఆది నుండి వ్యతిరేకిస్తూనే వచ్చాయి.

చంద్రబాబును విలన్ గా చూపిస్తూ లక్ష్మి పార్వతికి పాజిటివ్ గా ఉండేలా తెరకెక్కించిన ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అభిమానులు. ఎన్నికల ముందు రిలీజ్ డేట్ ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఈసీని, హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీలో ఏప్రిల్ 3 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను విడుదల చేయరాదని ఆదేశాలు జారీ చేస్తూ తెలంగాణ లో రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. నేను ఎలాగైనా ఎన్నికల ముందే ఏపీలో రిలీజ్ చేస్తానని సవాల్ చేసిన వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారించిన సుప్రీమ్ కోర్ట్ రాంగోపాల్ వర్మకు భారీ ఝలక్ ఇచ్చింది. సినిమా ద్వారా టీడీపీకి కొంత నష్టం చేకూరుతుంది అని ఆశించిన వైసీపీకి కూడా సుప్రీం కోర్టు తీర్పుతో షాక్ తగిలినట్టైంది.

ఏపీలో సినిమా రిలీజ్ ను అడ్డుకోవడం వెనుక రాజకీయ అజెండా ఉందని ఆరోపించిన వర్మ త్వరగా విచారించి సినిమా విడుదల అయ్యేలా చెయ్యాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అభ్యర్ధనను తిరస్కరించింది.

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. సుప్రీం కోర్టులో దీనిపై అంత త్వరగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *