స్టార్టప్ చోద్యాలు…దయచేసి పిరికివాళ్లు దీన్ని చదవకండి…

సాహసికాని వాడు జీవన సమరానికి పనికారాడు,అని ఒక తెలుగు మహాకవి పిరికి వాళ్లందరిని మీచావు మీ చావండని అదిలించాడు. చుట్టూర సమస్యలున్నాయి. వీటిని చూసి జడిసిపోయే వాళ్లు ఈ తరానికి పనికిరారు. సమస్య వెనక పరిష్కారం ఉందని కొండంత విశ్వాసంతో ఎన్నికష్టాలెదురయినా ఒక్కొక్కడుగు ముందుకేసే వాళ్లదే భవిష్యత్తు. ఇలాంటి సాహసులే స్టార్టప్ లను ప్రారంభించి దూసుకుపోతున్నారు… ఇక నుంచి స్టార్టప్ చోద్యాలు చదవండి. స్ఫూర్తి పొందండి….

Rent My Stay

ఈ మధ్య మా ఫ్రండొకాయనకు పెద్ద సమస్య వచ్చింది. వాళ్లింట్లో ఒకరికి పెద్ద జబ్బు చేసింది. వాళ్లని సిటి లోని ఒక ఆసుపత్రిలో చేర్చాలి. ఆపరేషన్ జరగాలి. ఈ పనిమీద వాళ్లు కనీసం 20 రోజుల నుంచి నెల రోజుల దాకా హైదరాబాద్ లో ఉండాలి. పెద్ద ఆపరేషన్ కాబట్టి పేషంట్ ఆసుపత్రిలో ఉన్నపుడు చాలా మంది చూడటానికి వస్తారు. పేషంట్ సహాయం గా ఉండేందుకు ఒకరిద్దరు వంతుల వారీగా ఉండాలి. ఒక నెల పాటు హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలి? అది కూడా అసుపత్రికి సమీపంలో ఉండాలి. లాడ్జ్ తీసుకుంటే రోజుకు కనీసం వేయి రుపాయలు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏదైనా ఫ్లాట్ ఒక నెలరోజులకోసం అద్దె పదివేలయినా పర్వాలేదనుకుని ఆసుపత్రికి ముందు వెనక ఉన్నకాలనీలలో వెదికాం. ఎక్కడ ఖాళీలు లేవు. ఉన్నచోట్ నెలరోజులకు ఇవ్వలేమని చెప్పారు. ఆసుప్రతి పని అని చెప్పినా వాళ్లు అంగీకరించలేదు. ఎక్కడా దొరకలేదు. ఇది మమ్మల్ని బాగా క్రుంగదీసింది. చివరకు ఎక్కడో దూరాన నా ‘బ్యాచిలర్ రూం’ ను వాళ్ల క అప్పగించి నేను మరొక ఫ్రెండ్ గదిలో అడ్జస్టయిపోయాను. రోజూ పొద్దన, సాయంకాలం కాలనీలన్నీ తిరిగి వేసారి పోయినపుడు,నేను నామిత్రుడు రోడ్డుపక్కనున్న ఒక టీ బండిదగ్గిర  టీ తాగుతూ రోజు, రెండు రోజులకు అత్యవసరాలకోసం సిటికి వచ్చే కుటుంబాలకు ఇళ్లను అద్దెకిచ్చే ఏర్పాటుంటే ఎంత బాగుంటుందని అనుకున్నాం. ఇలా ఆసుపత్రులకువచ్చే వాళ్లకు,ఇంటర్యూలకు వచ్చే వాళ్లకు, పెళ్లి సమాయాలలో అతిధులను తక్కువ ఖర్చుకు సర్దుబాటు చేయాలనుకునే వాళ్లకు టెంపరరీ అద్దె ఇళ్లు వుంటే ఎంతబాగుంటుందనుకున్నాం…

వాారానికి 6 రోజులు 6 సార్లు సెక్స్ ఉద్యోగాలకు అలీబాబా ఛీఫ్ సలహా

ఇలాంటి సమస్యే కొద్ది కాలం కిందట కిరణ్ నాగరాజప్ప, రాకేష్ కాంబ్లేలకు ఎదురయింది. వీళ్లలో ఒకరి బంధువు బెంగుళూరు వీళ్లుంటున్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నాడు. బంధువుండేది దూరాన పల్లెలో. వాళ్ల పిల్లలు అక్కడి స్కూళ్లో చదువుతున్నారు. ఇంటినిర్మాణం ఎటూ కాకుండా అకడమిక్ ఇయర్ మధ్యలో పూర్తవబోతున్నది. కొత్త ఇంట్లో చేరేపట్టప్పటికి అకడమిక్ ఇయర్ మధ్యలో ఉంటుంది. అందుకని, ఒక అయిదారు నెలల ముందే ఫామిలీని బెంగుళూరు కు మార్చాలనుకున్నారు. ఎలా? అయిదారు నెలల కోసం ఒక ఇంటిని కాలనీలో వెదికేందుకు విశ్వప్రయత్నాలు చేశాం. చాలా మంది అరునెలలకు ఇవ్వమని చెప్పారు. ఇచ్చినా విపరీతంగా అడ్వాన్స్ అడుగుతున్నారు. అతికష్టం మీద ఒక స్కూల్ కు దగ్గరలో ఒక ఇల్లు దొరికింది. అందరికి అట్లాంటి అదృష్టముండుదు కదా.
రెండు మూడు నెలలకు ఇల్లెవరూ అద్దెకిఇవ్వరు. ఈ ఇల్లు దొరక్కపోయి ఉంటే ఎంతకష్టమయి ఉండేదని వారికి అనిపించింది. అదెంత మానసికవత్తిడి తీసుకువచ్చి ఉండేది. ఇలాంటి వాళ్లెందరో ఉంటారు. వాళ్ల సమస్యకు సులభంగా పరిష్కారం కావాలి.
‘ఇపుడయితే మేం దగ్గిర ఉండి ఇల్లు వెదికి పెట్టాం. నగరంలో తెలిసిన వాళ్లెవరూ లేకపోతే చాలా కష్టం. ఏ మయినా సరే ఇలాంటి సమస్య ఉందని, అది తీవ్రంగా ప్రజలను వేధిస్తూ ఉందని గుర్తించాం. పరిష్కారం కనుక్కొవాలనుకున్నాం. అంతే అది Rentmystay ఆకారంగా తీసుకుంది,’ వారు చెబుతున్నారు.
Rentmystay 2014 లో బెంగుళూరులో మొదలయింది.  కిరణ్,రాకేష్ లు ఎదుర్కొన్న తాత్కాలిక బస సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటయింది. ఒక రోజు, రెండు రోజులు మొదలుకుని నెల రెన్నెళ్ల దాకా తాత్కాలికంగా హైదరాబాద్ వంటి నగరాలలో బస చేయాలనుకుంటున్న వారికి స్టార్టప్ చక్కటి పరిష్కారం కనుగొనింది.
చిత్రమేమిటంటే, అద్దెకు తాత్కాలిక అకామిడేషన్ కావాలనుకునే వారు ఎలాంటి బ్రోకర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. హోటల్ లో దిగినంత ఈజీ ఈ చక్కటి ఇళ్లలో దిగవచ్చు.
దీనికి ఇల్లు వెదుక్కోవడం చాలా పెద్ద సమస్య. ఇదిబాగా చికాకుపెడుతుంది.వెదికేందుకు తిరగాలంటే టైం ఉండదు, ఒక సారి వెదికితే ఇల్లు దొరకదు. ఈ దొక పెద్ద సమస్య. సమస్యలో వ్యాపారావకావం వెదకడం బుద్ధిమంతుడి లక్షణం. కిరణ్, రాకేష్ చేసిందదే.
ఈ బిజినెస్ ఆలోచన వచ్చాక దానిని రూపమిచ్చి, ఒక స్థాయికి తీసుకువచ్చేందుకు కిరణ్ , రాకేష్ లు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అక్కడే మనిషిలో సాహసి బయటకు వస్తాడు.
ఇపుడు నిటారుగా నిలబడ్డారు. ఇద్దరితో ఒక ఆలోచనగా మొదలయిన Rentmystay ఇపుడు 35 మంది సిబ్బందితో నడుస్తూ ఉంది. ఇప్పటిదాకా 30 వేల మందికి సేవలందించారు. ఇంతవరకు బెంగుళూరు లో 1000, పుణేలో 160,హైదరాబాద్ లో 120 ఇళ్లను అద్దెకిచ్చారు. ఇలాగే ముంబయి, చెన్నైలలో కూడా కొన్నిఇళ్లను అద్దెకిచ్చారు. ఇపుడు కొన్ని నగరాలకే పరిమితయినా తొందర్లో దేశంలోని అన్ని నగరాలలో సేవలందించాలని ఈ ఇద్దరి మిత్రులు చూస్తున్నారు.
సమస్యలకు మనల్ని క్రుంగ దీసే స్వభావం ఉంటుంది.బలహీనులు క్రుంగిపోతారు. సాహసులు ప్రతిసమస్య వెనక ఒక విజయావకాశాలు చూస్తారు. ముందుకు అలా వెళ్లిపోతూ ఉంటారు. బెస్టాఫ్ లక్ కిరణ్ అండ్ రాకేష్. (ఫోటో క్రెడిట్స్ స్టార్టప్ అర్బన్)
(మీకు తెలిసిన స్టార్టప్ సక్సెస్ స్టోరీస్ (విజయగాథలు మాకు పంపండి. లేదా సమాచారం మీయండి. మా ప్రతినిధులు వాళ్లని కలసి వాళ్ల విజయగాథను అందరికీ పంచుతాం. మెయిల్ ఐడి trendingtelugunews@gmail.com )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *