భారత ప్రధాన న్యాయమూర్తి మీద లైంగిక వేధింపుల ఫిర్యాదు

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె వయసు 35 సంవత్సరాలు. కోర్టు ఉద్యోగి.

తనను జస్టిస్ రంజన్ గొగోయ్ ఎలా వేధించాడో వివరిస్తూ ఆమె సుప్రీం కోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఏప్రిల్ 19న  ఒక అఫిడవిట్ సమర్పించారు.

తనను లైంగికంగా హింసించిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె పేర్కొంది.

గత ఏడాది అక్టోబర్ 10, 11 తేదీలలో తాను ప్రధాన న్యాయమూర్తి ఇంటిదగ్గిరి ఆఫీసులో  పని చేస్తూ ఉన్నపుడు జస్టిస్ గొగోయ్ లైంగికంగా తన మీద దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు.

‘ఆమె కుటుంబాన్ని మొత్తంగా వేధించారు. భయపెట్టారు. బాధించారు. తర్వాత ఆమెకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారు. ఎడతెరిపిలేకుండా ఆమెను వేధిస్తూనే ఉన్నారు. బాధిస్తూనే ఉన్నారు. ఇలా వేధించడం ఆమెను నోరు మూయించేందుకే కాదు, ఆమె శిక్షించేందుకు కూడా ఈ పని చేస్తున్నారు. డాక్యుమెంటరీ సాక్ష్యాలతో ఆమె తనకు జరిగినఘోరాన్ని వివరించారు,’అని వ్రిందా గోవర్ అనే మానవహక్కుల న్యాయవాది పేర్కొన్నారని ‘ ది క్వింట్’ రాసింది.

Read this also.

https://trendingtelugunews.com/jersey-an-emotional-journey-movie-review/

బాధితురాలు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో ఉన్న కార్యాలయంలో కోర్టు అసిస్టెంట్ గా పని చేసేది. జస్టిస్ గొగోయ్ చేష్టలను తిరస్కరించాక ఆమెను క్యాంప్ ఆఫీస్ నుంచి తప్పించేశారు. అక్కడ ఆమె 2018 ఆగస్టు నుంచి పని చేస్తున్నారు.

రెన్నెళ్ల తర్వాత డిసెంబర్ లో ఆమెను ఉద్యోగం నుంచి తొలిగించారు. తొలగించేందుకు చూపిన కారణాలలో ఆమె అనుమతి లేకుండా ఒక రోజు క్యాజువల్ లీవ్ తీసుకున్నారనేది కూడ ఒకటి. ఉద్యోగం నుంచి తొలగించాక కూడా ఆమెను వేధించడం ఆగలేదని ఆమె కోర్టుకు ప్రమాణం చేసి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

జస్టిస్ గొగోయ్ తో వచ్చిన సమస్య తన కుటుంబానికి మొత్తం చుట్టుకుంది. తన భర్త, బావలు ఇద్దరు హెడ్ కాన్ స్టేబుళ్లని, వారిని ఢిల్టీ పోలీస్ నుంచి సస్పెండ్ చేశారని కూడా ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నారు.

దీనికి ఎపుడో 2012 లో కాలనీలో వచ్చిన ఒక వివాదాన్ని సాకుగా చూపారు. నిజానికి ఈ వివాదం రాజీతో పరిష్కారం కూడా చేసుకున్నారు.

ఖండించిన ప్రధాన న్యాయమూర్తి

అయితే, తన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ తిరస్కరించారు. ప్రధాన న్యాయమూర్తి మీద ఒక మహిళచేసిన ఆరోపణలను శనివారం నాడు సుప్రీంకోర్టు స్పెషల్ బెంచొకటి విచారణ చేపట్టింది. ఈ విచారణ జరుగుతున్నపుడు ప్రధాన న్యాయమూర్తి తన మీద ఆరోపణలను తిరస్కరించారు. న్యాయవ్యవస్థ కు ముప్పు ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ‘ The judiciary is under threat today’ అన్నారు.

‘ఇది నమ్మ శక్యం కానిది. దీనిని తిరస్కరించేందుకు నేను ఇంతకంటే దిగజారి మాట్లాడలేకపోతున్నాను,’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

న్యాయ వ్యవస్థను అస్థిరపరిచేందుకు ఒక పెద్ద కుట్రజరుగుతున్నట్లు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

భారతదేశం  46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ అక్టోబర్ 3,2018 బాధ్యతలు చేపట్టారు.

కోర్టు ఉద్యోగి  ఫిర్యాదు అందిన తర్వాత సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. దీని తర్వత విచారణ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేశారు.

తర్వాత సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ సుధాకర్ కల్ గావకర్ మాట్లాడుతూ ఈ ఆరోఫణలు దురుద్దేశంతో కూడుకున్నవని, నిరాధారమైనవని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *