సెర్ప్ ఉద్యోగులకు మంత్రి ఎర్రబెల్లి తీపి కబురు

మామిడి ప్రాసెసింగ్ ప్రక్రియ లో ఐకేపీ పాత్ర ప్రశంసనీయం…
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
మహిళలు సేకరించిన మామిడి పండ్లు మంత్రికి అందజెసిన సెర్ప్ నాయకులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రెగ్యులరైజ్ & పేస్కెలు పై ప్రకటన చేయించాలని సెర్ప్ రాష్ట్ర జేఏసీ వినతిపత్రం.

పూర్తి వివరాలు కింద చదవండి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆహార శుద్ధి పరిశ్రమ ఆలోచనలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో 4 జిల్లాలో మామిడి పండ్లు సేకరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సేకరణ విధానం, రైతులకు అదనపు లాభాలు, మహిళలకు ప్రయోజనాలు జరుగుతున్న విధానాన్ని సెర్ప్ జాక్ నేతలు మంత్రి కి వివరించారు.
టన్ను కు రైతుకి రు.15000 అదనంగా లబ్ధి పొందుతున్నారని, నేరుగా మామిడి తోట నుండి కొనుగోలు చేసి,
ఉచితంగా రవాణా చేస్తున్నామని, లాభాలు సైతం మహిళా రైతుల తో ఏర్పాటు చేసిన రైతు సంఘాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం తో ఐకేపీ కి అప్పజెప్పేన కార్యక్రమంలో విజయవంతం గా తొలిఅడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.
జేఏసీ వినతుల పై స్పందిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ హామీ మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయం చేస్తారని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుంట గంగారెడ్డి, ఏపూరి నర్సయ్య, సుభాష్, సుదర్శన్, దుర్గారావు, ఓదెలా గంగాధర్, ఈశ్వర్, దాసు, రత్నాకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *