“సత్య గ్యాంగ్”సెన్సార్ పూర్తి

క్వాలిటీ కొరకు 16 నెలలు శ్రమించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, మంచి పాటలు ,ఫైట్స్ ,డాన్స్ ముఖ్యంగా సెంటిమెంట్ కు ప్రాదాన్యత నిస్తూ తెరకెక్కించిన చిత్రం “సత్యగ్యాంగ్”. యువత తో పాటు మహిళా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునెలా ఈ చిత్రముంటుంది. పురుషుల విషయానికి వస్తే ఓ బాధ్యత గల తండ్రిగా కుటుంబంతో కలిసి చూడవలసిన చిత్రంగా సత్యగ్యాంగ్ ను చెప్పుకొవాలి. తల్లి తన పిల్లలతో ప్ర‌తి విషయాన్ని పంచుకుంటుంది. కానీ తండ్రి తన పిల్లలతో అన్నీ విషయాలు చెప్పుకోలేడు.  తండ్రి తాను డైరెక్ట్ గా చెప్పలేని విష‌యాన్ని ఓ మెసేజ్ రూపంలో `స‌త్యగ్యాంగ్` చిత్రం ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంది.
ఇప్పటికే ఈ చిత్రంలొని అన్నీ పాటలుహిట్ అయ్యాయి.చంద్రబొస్ రాసిన `ఎవరు చెసిన పాపమో..` అన్న సాంగ్ విన్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. అలాగే “కనులే చూసిన దెవతవో ” పాట , అబ్బాయి మనసె కనలేవా అన్న పాట యువతను, ఓర ఓర మాసుగున్నడే మినిష్టర్ పాట మాస్‌ణు హుషారెత్తిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితె  సినిమా క్లైమాక్స్‌లో అనాథల భవిష్యత్తుకు సరైన పరిష్కార మార్గం చూపటం హైలెట్ గా నిలుస్తుంది.ఓ మంచి సినిమా వల్ల ప్రేక్షకులకు ఓ ఇన్స్పిరేషన్ లభిస్తుంది `సత్యగ్యాంగ్` అలాంటి మంచి చిత్రంగా నిలుస్తుందని ఈ చిత్రానికి నిర్మాత  దర్శకత్వ పర్యవేక్షణ చెసిన మహేష్ ఖన్నా తెలిపారు.
సాత్విక్ ఈశ్వర్, అక్షిత,
ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఎడిటర్: నందమూరి హరి,  కో-డైరెక్టర్స్; నాగబాబు-కొండలరావు,
సంగీతం : జెబి( ఫిదా ఫేం), ప్రభాస్ , దర్శత్వం : ప్రభాస్,  నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: మహేష్ ఖన్నా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *