`తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల 

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌`. `కేసులు ఇవ్వండి ప్లీజ్‌` ట్యాగ్ లైన్‌.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.
ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సందీప్‌కిష‌న్ పుట్టిన‌రోజు(మే 7) సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మంచి పేరున్న ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని కూడా త‌న‌దైన స్టైల్లో లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. హ‌న్సిక,  వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
నేటి నుండి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది.
సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌
హ‌న్సిక‌
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌
ముర‌ళీ శ‌ర్మ‌
బ్ర‌హ్మానందం
వెన్నెల‌కిశోర్‌
ప్ర‌భాస్ శ్రీను
పృథ్వి
ర‌ఘుబాబు
స‌ప్త‌గిరి
ర‌జిత‌
కిన్నెర‌
అన్న‌పూర్ణ‌మ్మ‌
వై.విజ‌య‌
స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  జి.నాగేశ్వ‌ర రెడ్డి
నిర్మాత‌లు: గ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్
స‌మ‌ర్ప‌ణ‌:  ఇందుమూరి శ్రీనివాసులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సీతారామ‌రాజు మ‌ల్లెల‌
క‌థ‌:  టి.రాజ‌సిహ‌
మ్యూజిక్:  రాజసింహ‌
సంగీతం:  సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సాయిశ్రీరాం
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్రసాద్‌
డైలాగ్స్‌:  నివాస్, భ‌వానీ ప్ర‌సాద్‌
స్క్రీన్‌ప్లే:  రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్‌:  కిర‌ణ్
యాక్ష‌న్‌:  వెంక‌ట్‌
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *