హరీష్ పై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ఎలక్షన్ రిజల్ట్స్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మాజీ టీఆరెస్ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రేవంత్. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

ప్రజలు ఓటేస్తే కదా… పోలీస్ లు ఓటేస్తే ఏం చేస్తాం? పోలీసులే ఓట్లు వేపించారు, అందుకే ఓడిపోయాము అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కోర్టు కూడా పోలీసులు తప్పుచేశారని చెప్పింది అని వెల్లడించారు. కొడంగల్ లో 60శాతం సర్పంచ్ లు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు.

కాంగ్రెస్, టిఆర్ఎస్ లో ఉన్న 30 మందికి హరీష్ రావు ఎన్నికల ఖర్చు ఇచ్చాడు. కాంగ్రెస్ లో కొందరు తీసుకోలేదు. ప్రతాప్ రెడ్డి చెప్పింది కూడా అదే. టిఆర్ఎస్ లో 26 మంది తీసుకున్నారు. కేసీఆర్ కి తెలియకుండా ఇచ్చాడు. ఇంటలిజెన్స్ నివేదిక బయట పెట్టారు. అందుకే ఆయన్ని కేసీఆర్ పక్కన పెట్టారు.

మిడ్ మానేరు, గౌరిల్లి, తోటపల్లి లో సుమారు 1000 కోట్ల పనులు టెండర్ లేకుండా హరీష్ ఇచ్చారు. అంచనాలు పెంచి, పాత కాంట్రాక్టర్లకు పనులు ఇప్పించి, 600 నుండి 700 కోట్లు జుర్రుకున్నాడు. వాటినే 30 మందికి పంచాడు.

అమిత్ షా తో హరీష్ మాట్లాడిన వీడియో సీఎం పిలిచి వినిపించారు. హరీష్ వ్యవహారానికి చెందిన డాక్యుమెంట్లు బయట పెడతా హరీష్ కి మంత్రి పదవి ఉండదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. నాయిని, కడియం, తుమ్మల కి పదవులు ఉండవు.

కడియం శ్రీహరి, నాయిని అవినీతి పరులు కాదు. అందుకే పక్కన పెట్టారు. ఈటెల కి 50…50 ఛాన్స్. తుమ్మల కేటీఆర్ ని సార్ అని కాకుండా… రాము అని అంటున్నాడు అని పక్కన పెడుతున్నారు. హరీష్ పట్ల నాకు సానుభూతి ఉంది. కేటీఆర్ వడ్డించిన విస్తరి లాక్కుంటున్నాడు అని విమర్శించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతి ఆయన కుటుంబానికి సంబంధించినవే అని ఆరోపించారు రేవంత్ రెడ్డి. హరీష్ దగ్గర డబ్బులు తీసుకున్న 26 మందికి శిల పరీక్ష మాదిగలకు మంత్రి పదవి లేదు. కేసీఆర్ ఫ్యూడల్. మహిళల్ని మంత్రులు చేస్తాడా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *