ఎంపీగా నామినేషన్ వేసిన రేవంత్… సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్దిగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారంటే…

“కేసీఆర్ ఉద్యమకారులకు మొండి చేయి చూపి ధనవంతులకు టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. టిఆర్ఎస్ కు మళ్లీ ఓటేస్తే కేసీఆర్ కు ఇంతకంటే పెద్ద పదవి రాదు. 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టే వారికి కేసీఆర్ టికెట్లిచ్చారు.

టీఆర్ఎస్‌లో జితేందర్ రెడ్డి, సీతారాంనాయక్, వివేక్‌ పరిస్థితి దిక్కుదోచకుండా ఉంది. మల్లారెడ్డికి పేమెంట్ కోటాలో మంత్రి పదవి వస్తే.. రాజశేఖర్ రెడ్డికి వేలంపాటలో మల్కాజిగిరి టికెట్ వచ్చింది.  తనను గెలిపిస్తే మల్కాజిగిరి ప్రజల ఆత్మగౌరవం పెరిగేలా కృషిచేస్తాను.   ప్రతిపక్షం ఉండకూడదని వైఎస్ అనుకుంటే కేసీఆర్ ఉండేవారా?, ఇందిర అనుకుంటే వాజ్ పేయి, ఆద్వాణి వంటి వారు ఉండేవారా? లోక్ సభ ఎన్నికలు మోడీ రాహుల్ మధ్యనే జరుగుతున్నాయి. మధ్యలో ఎవరూ లేరు.

మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జండా ఎగురుతుంది. ఉద్యమకారులను పక్కన బెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టే వారికి కేసీఆర్ టికెటిచ్చారు. రియల్ ఎస్టేట్ దందాగాళ్లు పార్లమెంటులో మాట్లాడుతారా. మల్కాజ్ గిరి సమస్యల పై పోరాడుతా. నన్ను ఆశీర్వదిస్తే అద్భుతాలు సృష్టిస్తా. అభివృద్ది చేసి చూపిస్తా. ఇరవై రోజులు కాంగ్రెస్ కోసం పనిచేయండి .. ఇరవై ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేస్తా” అని రేవంత్ అన్నారు.

ఇది కూడా చదవండి IPL 2019 Special

https://trendingtelugunews.com/will-smith-change-the-fate-of-rajasthan-royals/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *