కోదండరాంతో భేటి అయిన రేవంత్ రెడ్డి (వీడియో)

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పై రేవంత్ కోదండరాంతో చర్చించారు. అదే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటి చేస్తుండడంతో అక్కడ తనకు సహకరించాలని రేవంత్ కోరారు. అదే విధంగా భవిష్కత్ కార్యాచరణ పై రేవంత్ రెడ్డి కోదండరాంతో చర్చించారు.

రేవంత్ మద్దతు అడగడంతో కోదండరాం సానుకూలంగా స్పందించారు. దీని పై రేవంత్ రెడ్డి మాట్లాడారు.

“మల్కాజ్ గిరి మిని భారతదేశం. మల్కాజ్ గిరి సమస్యల పై పోరాడుతా. తెలంగాణ ఇవ్వడమే కాదు, తెలంగాణకు కాంగ్రెస్ చాలా హామీలిచ్చింది. వాటన్నింటిని నెరవేరుస్తాం. మల్కాజ్ గిరిలో గెలవడానికి కోదండరాం సహకారం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానంటున్నాడు… ఎన్నికలు అయిపోయాక పెడుతారా. 16 సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి కూడా 165 మంది ఎంపీలున్నారు. ఏం సాధించారు.” అని రేవంత్ ప్రశ్నించారు.

దీని పై కోదండరాం స్పందించారు.

“మల్కాజ్ గిరిలో తనకు మద్దతు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడిగారు. ప్రశ్నించే గొంతుకల అవసరం ఉంది. వారు ప్రజా ప్రతినిధులుగా ఉండాలి. రేవంత్ తో స్నేహం ఉంది. రేవంత్ లాంటి వారి అవసరం ఉంది. దీని పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని కోదండరాం అన్నారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికే సీపిఐ నేతలతో కూడా చర్చలు జరిపారు. వారు రేవంత్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి కోదండరాంతో సమావేశమైన వీడియో కింద ఉంది చూడండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *