ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ?

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్మణ్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకాయుక్తగా నియమితులయ్యే అవకాశం ఉంది. రేపో మాపో ఈ మేరకు ఉత్తర్వులు వెలవడవచ్చని విశ్వసనీయంగా తెలిసింది.
ప్రభుత్వంలోని అక్రమాలకు మీద చాలా చారిత్రాత్మక తీర్పులిచ్చిన న్యాయూమర్తిగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డికి పేరుంది. కడప జిల్లా రైల్వేకొండాపురానికి చెందిన జస్టిస్ లక్మణ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు నుంచి రిటైరయినప్పటి నుంచి  యాక్టివిస్టుగా మారాారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ, ఇతర వెనకబడిన ప్రాంతాల హక్కులకోసం ఆయన పోరాటం చేస్తూ వచ్చారు.
రాయలసీమకు రాజధాని రావాలని, లేదా ఒక వెనకబడిన ప్రాంతానికి రాజధాని రావాలనేది ఆయన డిమాండ్ . అదే విధంగా అమరావతి రాజధాని ఏర్పాటులో ఎలా  అక్రమాలు చోటుచేసుకుంటున్నాయో,  అక్కడ రాజధాని ఏర్పాటు  పర్యావరణ విధ్వసంగా తయారవుతున్నదో వివరిస్తూ కూడా ఆయన క్యాంపెయిన్ చేపట్టారు.
అమరావతి లో సాగుతున్న భూసమీకరణ లొసుగులను కూడా ఆయన ఎత్తి చూపెట్టారు. అమరావతి ప్రాంతానికి రాజధాని సరైనది కాదని చెబుతూ అక్కడి వ్యవసాయానికి, భూసమీకరణను వ్యతిరేంచిన రైతుల పక్షాన నిలబడ్దారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి,పోలవరం వంటి మెగా ప్రాజక్టులలో అవినీతి గురించి విచారణ జరిపించాలని నిర్ణయించిన సమయంలో లోకాయుక్తగా జస్టిస్ లక్మణ్ నియామకం జరుగతున్నదని వార్తలొస్తున్నాయి.
సాధారణంగా ప్రభుత్వాలలో సాగే అవినీతి మీద విచారణలన్నీ అసంపూర్ణంగా మూలన పడతాయి. సంపూర్ణమయితే అవి ప్రభుత్వంలోని ప్రముఖులకు ఉపశమనం కల్గిస్తాయి. ఇలా చాలా మంత్రి మంత్రులు సిబిఐ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇలాంటి వాతావరణంలో ఒక  అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఒక లోకాయుక్త తీర్పు చెప్పి, జైలుకుపంపిన  సంఘటనలు అరుదు.
కర్నాటక లోకాయుక్త జస్టిస్ నిత్తే సంతోష్ హెగ్డే చారిత్రాత్మకమయిన విచారణ ఒక్కటే ఇలా చరిత్రలో మిగిలింది.
బిజెపి ముఖ్యమంత్రి యడ్డియూరప్ప అక్రమాల మీద విచారణ జరిపి ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని ధైర్యంగా చెప్పిన లోకాయుక్త జస్టిస్ హెగ్డేయే.
ఒక ముఖ్యమంత్రి లాంటి వారిని జైలుకు పంపడం అనేవి విదేశాలలో జరుగుతుండే వింతలే గాని భారతదేశంలో వూహించలేని పరిణామాలు.
అలాకాదు, నిజాయితీ ఉండే వాళ్లని లోకాయుక్తగా నియమించి అధికారాలిస్తే ఇక్కడ కూడా చాలా మంది అధికారంలో ఉన్నా కూడా జైలుకు పంపవచ్చని జస్టిస్ హెగ్డే రుజువుచేశారు.
ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల, రవాణా కేసును అవినీతి నిరోధ చట్టం కింద విచారణ చేసి ముఖమంత్రి యడ్డియూరప్ప అక్రమాలకు సాక్ష్యాలున్నాయని కర్నాటక లోకాయుక్త గా ఉన్న జస్టిస్ హెగ్గే నిరూపించారు.
లోకాయుక్త నివేదిక ( 25, 228 పేజీలు)ను ఆయన 2011 జూలైలో గవర్నర్ కు సమర్పించారు. జూలై 17న విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.   తర్వాత 2011 ఆగస్టు 4న యడ్డియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తర్వాత లోకాయుక్త ఆయనకు అరెస్టు వారంట్ ఇచ్చింది. అక్టోబర్ 22 అరెస్టు చేసి యడ్డియూరప్పను బెంగుళూరు సెంట్రల్ జైలుకు పంపించారు.
ప్రభుత్వంలో భారీగా ముడుపులు మారుతున్నాయని,ఫలానా ప్రాజక్టులో కమిషన్లు చేతులు మారాయనిఅనడమే కాని ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మీద,మాజీ ముఖ్యమంత్రుల మీద విచారణలే జరగలేదు.
అయితే  దీనికి లోకాయుక్తకు కోరలుండాలి. లోకాయుక్తను  కర్నాటక మోడల్ లో పటిష్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి.
చాల భారీ కుంభకోణాలమీద ఆంధ్రలో విచారణ జరిగే సూచనలు కనపడతున్నందున, జస్టిస్ లక్మణ్ రెడ్డిని లోకాయుక్తగా నియమించాలను కోవడం విశేషం.
అయితే, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కూడ కర్నాటక తీరులో ఉండాలి. ముఖ్యమంత్రి జగన్ లోకాయుక్తను ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్న పంక్షనరీనయినా విచారంచగలిగే టంతటి బలమయిన ఇన్ స్టిట్యూషన్ గా మారుస్తారా?