రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ దెబ్బ.. ఏం జరిగిందంటే ?

హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఆరేళ్ల తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యే రేణూదేశాయ్ తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. దాంతో పవన్ ఫ్యాన్స్ నుంచి ఆమెకు తీవ్ర విమర్శలు వచ్చాయి. మరికొంత మంది ఫ్యాన్స్ రేణూకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి రేణూ దేశాయ్ కూడా అంతే స్థాయిలో ఫ్యాన్స్ కు సమాధానమిచ్చారు. మొత్తానికి రేణూ దేశాయ్ వివాహ నిశ్చితార్థం హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ విమర్శల వర్షంతో రేణూ తన ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేసుకున్నారు.

అసలే రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ తన మాజీ భార్య వివాహం చేసుకోబోతుందన్న విషయం తెలుసుకొని స్పందించారు. నీ జీవితం సంతోషంగా సాగాలంటూ రేణూదేశాయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ట్వీట్ చూశాకైనా అభిమానుల నుంచి విమర్శలు తగ్గుతాయని రేణూ భావించారు.కానీ ఫ్యాన్స్ నుంచి ఏ మాత్రం కూడా మార్పు లేదు. దీ నితో విసుగెత్తిన రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచే మాయమయ్యారు.పవన్ ఫాన్స్ తన జీవితాన్ని శా సించే లా ప్రవర్తినుంచడం ఆమెకు నచ్చడం లేదు. పవన్ పెళ్లి చేసుకుంటే నోరెత్తని ఫాన్స్ పెళ్లి చేసుకో వద్దని ఆమె మీద వత్తిడి తీసుకు రావడాన్ని చాలా మంది విమర్ధించారు కూడా.

ఇంతకీ రేణూ చేసుకోబోయేది ఎవరనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. అతను పుణే నగరానికి చెందినవాడన్న విషయం మాత్రం బయటపడింది. రేణూకి పవన్ మాజీ భార్యగా ఉంటేనే గౌరవం ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.వ్యక్తి స్వేచ్చను అడ్డుకునే హక్కు ఎవరికి లేదని మరికొందరంటున్నారు. మొత్తానికి రేణూ ఎంగేజ్ మెంటే ఇంత హాట్ టాపిక్ గా మారితే పెళ్లి అయ్యే సరికి ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నాయో…అనే చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *