ఆంధ్రాలో రీపోలింగ్ పై ఈసీ సంచలనం నిర్ణయం

ఆంధ్రాలో ఎన్నికలు మొదలైన నాటి నుండి ఈవీఎంల విషయంలో గందరగోళం నెలకొంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం లు పని చేయకుండా మొరాయించాయి. ఈ కారణంగా ఆయా కేంద్రాల్లో పోలింగ్ ఆల్సయంగా మొదలైంది. మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం ఏపీలో కొత్త చరిత్ర సృష్టించింది.

కాగా టీడీపీ శ్రేణులు ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీపై అసంతృప్తిగా ఉన్నారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందని, వైసీపీకి లబ్ది చేకూరేలా ఈసీ ప్రవర్తించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై చంద్రబాబు జాతీయ స్థాయిలో పోరాటం మొదలుపెట్టారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై బాబు ధ్వజమెత్తారు.

ఇటు వైసీపీ కూడా టీడీపీ పై విమర్శలు విసురుతోంది. 2014 లో ఈవీఎం ల విషయంలో లేని సమస్య ఇప్పుడే ఎందుకొస్తుంది? ఓడిపోతామేమో అనే భయంతోనే చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా వివి ప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపుకు సంబంధించిన పలు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అనేకానేక అనుమానాలకు నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఆంధ్రాలో రీపోలింగ్ అంశంపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒక కేంద్రంలో, నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల, గుంటూరు జిల్లాలో ఒకచోట రీపోలింగ్ జరిపించాలని కలెక్టర్లు ఈసీకి నివేదిక పంపారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.

అంతేకాదు నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధి మేకపాటి గౌతమ్ రెడ్డికి చెందిన వీవీ ప్యాట్ స్లిప్పులు పోలింగ్ బూత్ వద్ద బయట పడి ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్వో, ఏఆర్వోలపై ఎఫైఆర్ నమోదు చేయాలనీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో అసలు నిజాలు పోలీసుల విచారణలో బయటకు వస్తాయన్న ఈసీ అధికారి గోపాలకృష్ణ ద్వివేది… ఎన్నికల విధుల్లో పొరపాట్లు చేసిన సిబ్బందిపై చర్యలు టీయూకుంటామని స్పష్టం చేశారు. కాగా ఈ రాత్రికి రీపోలింగ్ టీడీలు వెల్లడించనున్నట్లు తెలిపారు ద్వివేది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/trs-new-sketch-for-local-body-elections/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *