స్టార్టప్ స్టోరీ… ఐపిఎస్ వదిలేసి రాజన్ సింగ్ ఏంచేస్తున్నాడో తెలుసా?

సాహసాలతో మొదలయి మన జానపద కథలన్నీ సుఖాంతమవుతాయి…ఆ తర్వాత వాళ్లిద్దరు హాయిగా జీవించారనో, ఆతర్వాత రాజుగారు హాయిగా రాజ్యపాలనచేశాడనో శుభంతో మన కథలన్నీ ముగుస్తాయి.
హాయిగా లాహిరి.. లాహిరిలో… అంటూ పాడుకుంటూ గడిపే జీవితంలో థ్రిల్ ఏముంటుంది అనుకునే వాళ్లూ ఉన్నారు.  జీవితంలో పాట ఆట అన్నీ ఉంటాయి. అయితే నిండుగా చాలెంజ్ ఉండకపోతే  ఉప్పుకారంలేని అన్నపు ముద్ద లా జీవితం చప్పగా ఉంటుంది! సుఖాంతమయ్యే జీవితంలో ధ్రిల్ ఏముంటుందని ప్రశ్నిస్తున్నాడు అయితే రాజన్ సింగ్ ఐపిఎస్ .
చాలెంజెస్ లేని జీవితం నాకొద్దు, నాది ఇష్టం లేదు అన్నాడు. అనడమే కాదు, తన ఐపిఎస్ ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి చాలెంజింగ్ జీవితాన్నెంచుకుని ఒక స్టార్టప్ ప్రారంభించారు. చిన్న చిన్న పట్టణాల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను లైవ్ క్లాస్ రూమ్స్ ద్వారా JEE/NEET పరీక్షలకు ప్రిపేర్ చేయడమే ఈ కాన్సెప్ట్ లక్ష్యం. అతి తక్కువ ఫీజుతో ఉత్యత్తుమ స్థాయి కోచింగ్ అందిస్తున్నారు.
రాజన్ సింగ్ 1997 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్ )కేరళ క్యాడర్ అధికారి. అంతకు ముందు ఐఐటి కాన్పూర్ నుంచి నుంచి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ బిటెక్ చేశాడు. సివిల్ సర్వీసెస్ (ఐపిఎస్) సెలెక్ట్ అయ్యాక మొదటి పోస్టింగ్ కరునాగపల్లి లో ఎ ఎస్ పిగా వచ్చింది. 2001లొ కేరళరాజధాని తిరువనంతపురం పోలిస్ కమిషనర్ గా ప్రమోట్ అయ్యాడు. అతి చిన్నవయసులోనే ఈ కీలకబాధ్యతలు స్వీకరించిన అధికారి అయ్యారు.
అక్కడ నేర చరిత్ర ఉన్న వాళ్లందరి వివరాలతో డేటాబేస్ తయారుచేయింది వాళ్ల కార్యకాలాపాల మీద నిఘాపెట్టించి, ఏదయిన నేరం జరగ్గానే టకీ మని నేరస్థులను పట్టుకోవడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే వాళ్ల వివరాల అధారంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చేపట్టి ఆయన బాగా ప్రశంసలందుకున్నారు. ఆయన తీసుకున్న చర్యలతో తక్కువ సిబ్బందితో శాంతి భద్రతల సమస్య ను నివారించేందుకు వీలయ్యేది.
సివిల్ సర్వీస్ ఛేదించేందుకు విద్యార్థులు పడుతున్న కష్టాలన్నీ ఇన్నీ కాదు. అలాంటపు అలవోకగా అన్ని పిన్న వయసులో సివిల్స్ పాసయి ఐపిఎస్ సాధించిన రాజన్ సింగ్, ఉన్నట్లుండి 2005 లో తిరువనంతపురం పోలీస్ కమిషనర్ గా ఉన్నపుడు ఉద్యోగానికి రాజీనామా చేశారు.
పోలీస్ శాఖలో ఉన్నతస్థాయికి చేరుకుని ఇంకా పైపైకి వెళ్లే అవకాశమున్న దశలో రాజన్ ఎందుకు రాజీనామా చేశారు?
‘ఉద్యోగం చాలా గొప్పగా ఉండింది. ఐఐటి లనుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్లకి సివిల్ సర్వీస్ అంటే చాలా ఆసక్తి వుంటుంది. సివిల్స్ ఎంపికయ్యి ఉద్యోగంలో చేరాను.మొదటి కొద్ది సంవత్సరాలు చాలా బాగుంది. అయితే, ఒక సారి ఉద్యోగంలో దేన్ని ఎలా చేయాలో అన్నీ నేర్చుకున్నాక ఇక జీవితం పాతబడుతుంది. ఉద్యోగం ఇక అంత చాలెంజింగ్ గా ఉండటం జరగదు. మొనాటనీ ఎంటరవుతుంది. 2004 నాటికి నాకీ పరిస్థితి వచ్చింది. అప్పటికి నాకింకా 30 సంవత్సరాలు కూడా పూర్తికాలేదు. ఇక 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇంత కాలం ఈ ఉద్యోగం చేయాలేనేమో అనిపించింది,’ అని ఆయన ది హిందూ కు చెప్పారు. అంతే, 2005 రాజీనామా చేసి ఎంబిఎ చదివేందుకు అమెరికా వెళ్లారు.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ లో ఎంబిఎ చదివారు. తర్వా మెక్ కిన్సే అండ్ కో న్యూయార్క్ లో రెండేళ్లు ఉద్యోగం చేశారు. తర్వా త ఇండియాకు తిరిగొచ్చి తర్వాత 2012 దాకా ఒక ప్రయివేటు ఈక్విటీ ఫండ్ లో చేరారు. 2012 లో ఆయన తాను అనుకున్నచాలెంజింగ్ లైఫ్ లోకి మళ్లీ ప్రవేశించారు. అదే ఇపుడు చేస్తున్న విద్యారంగ ప్రయోగం.ఆయన టీమ్ ఇది.
రాజన్ కు సైన్స్ లెక్కలు బాగా ఇష్టమయిన సబ్జక్టులు.అందువల్ల, అక్కడ ఇక్కడా ఉద్యోగాలు చేసే బదులు సైన్స్ ,మ్యాథ్స్ అధారంగా తనకిష్టమయిన పని చేస్తే బాగుంటుందనే అలోచన వచ్చింది. దీనికి అనువయినది విద్యారంగం.
ప్రతిఏటా లక్షలాది విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారు. సైన్య్ విద్య ను అభ్యసిస్తున్నారు.కొన్ని లక్షల మంది ఎంట్రన్స్ పరీక్షలురాసేందుకు అవసరమయిన కోచింగ్ అందుబాటులో ఉండదు,ఉంటే బాగా ఖరీదయిన వ్యవహారంగా ఉంటునన్నది.   గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు,చిన్న చిన్న పట్టణాలలో చదువుకునే విద్యార్థులు ఈ కోచింగ్ తీసుకోలేకపోతున్నారు. విద్యలో వెనకబడి పోతున్నారు. ఎంట్రన్స్ ఫీజులను భూమ్మీదకు తీసుకురావాలి. కోచింగ్ అందరికీ అందుబాటులో ఉండాలి. విద్యార్జన అనేది వినోదం లాగా ఉండాలి,’ అనే ఆలోచనతో ఆయన దేశంలో స్కూల్ ఎజుకేషన్ రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేయాలనుకున్నారు. దీన్నుంచి వచ్చిందే కాన్సెప్ట్ ఔల్ (ConceptOwl) స్టార్టప్.
దేశంలో సైన్స్ బోధన దారుణంగా ఉంది. అదే మాత్రం సృజనాత్మకంగా లేదు. ఒక వైజ్ఞానిక సూత్రాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడకుండా విద్యార్థులను కేవలం పరీక్షలకు తయారుచేసే విధంగా సైన్స్ బోధన దిగజారింది. చాక్ ఫీస్ బోర్డు లతో కాకుండా సైన్స్ విద్యను ఆసక్తి కరంగా మార్చే విధానాలను కనిపెట్టాలి. విద్యార్థులు తాము చదివే సైన్సంతా తమ చుట్టూర జీవితంలో ఉంటుందని చూడాలి. దానిని చూపించడమే మా కాన్సెప్ట్,’ అని ఆయన వివరించారు.
కాన్సెప్ట్ ఔల్ యాప్
రాజన్ స్టార్టప్ ఒక ConceptOwl app ను కూడా తయారుచేసింది. దీన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఖరీదయిన కోచింగ్ లకు వెళ్లలేని విద్యార్థులకోసం, కోచింగ్ అందుబాటులో లేని గ్రామీణ విద్యార్థులకోసం ఈ యాప్ ను తయారు చేశారు. సూదూర గ్రామాలలో ఉండే స్కూల్ టీచర్లు కూడా ఈ యాప్ లోని మెటీరియల్ ను వాడుకోవచ్చు. యాప్ తో పాటు కాన్సె ప్ట్ ఔల్ తన సొంత కోచింగ్ కేంద్రాలను సెకండ్ టియర్ పట్టాణలలో ప్రారంభించాలనుకుంటున్నది.
Concept Owl లోకి ఔల్ అంటే గుడ్డగూబ ఎలాదూరింది.దీనిని మాటేమిటి? ఈ చదువులోకి గుడ్ల గూబ ఎలా వచ్చిందనే అనుమానం రావచ్చు. దీనికి ఆయన  ఆసక్తికరమయిన సమధానం చెప్పారు. ‘మన సంప్రదాయంలో గుడ్ల గూబ అంటే చాలా తెలివైన పక్షి అనే విశ్వాసం. దానికి తోడు హారీ పాటర్ సీరీస్ లోని హెడ్విగ్ (గుడ్లగూబ) అంటే కూడా నాకిష్టం. దానికితోడు ఐఐటి సీటుకొట్టాలనుకునే విద్యార్థులంతా గుడ్లుగూబల్లాగే రాత్రిళ్లు పని చేస్తూ ఉంటారు,’ అని రాజన్ సరదాగా వివరిస్తారు.
ఐఐటిలు,మరికొన్ని విద్యాసంస్థల్లో తప్ప ఇండియాలో మెరుగయిన ఇంజనీరింగ్ విద్య అందించే సంస్థల్లేవు.అందువల్ల ఐఐటి వంటి సంస్థల్లో చేరేందుకు తీవ్రమయిన పోటీ ఉంది. పోటీనే వ్యాపారం చేసుకుంటూ రాజస్థాన్ లోని కోటా, తెలంగాణలోని హైదరాబాద్ లో కోచింగ్ సంస్థలు కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. దీనికి పూర్తిగా కోచింగ్ సంస్థలనే నిందించలేం. మొత్తంగా కింద స్కూల్ విద్య దగ్గరి నుంచి లోపాలున్నాయని రాజన్ చెబుతున్నారు. అందువల్ల  పిల్లలు ఇంటిదగ్గిరే ఉండి, కోచింగ్ కు ప్రిపేర్ కావడం కాన్సెప్ట్ అవుల్ చేసే పని. విద్యార్థుల తలుపు దగ్గిరకే ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా తక్కువ ఖర్చుతో. కుటుంబాల మీద ఆర్థికంగా, ఏమోషనల్ గా వత్తిడి లేకుండా చేసే కోచింగ్ ప్రత్యామ్నాయాల వేటలో మేమున్నాం. ఇందులో తొలి ప్రయత్నం ConceptOwl app అని రాజన్ వివరించారు.
(ఇది మీకు నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. పనికొచ్చే జర్నలిజానికి చేయూత నివ్వండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *