Home Telugu ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికల్లో పోటీ చేయరు

ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికల్లో పోటీ చేయరు

164
0
SHARE

తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ ఎం కోదండ రామ్ ఎన్నికల పోటీ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు.  తాను పోటీ చేయకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని వోడించేందుకు  ఆయన మహా కూటమి తరఫున రాష్ట్ర మంతా పర్యటించి ప్రచారం చేస్తారు.

ఆయన వరంగల్ నుంచి గాని, జనగాం నుంచి గాని పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా పార్టీ వర్గాలు చెప్పిందాని  ప్రకారం, ఆయన ఎన్నికల్లో పోటీ చేయరాదని, అలా చేస్తే కేవలం ఒకే నియోజకవర్గానికి పరిమితం కావలసి వస్తుందని బావించి ఈ నిర్ణయంతీసుకున్నారు. ఆయన కేవలం క్యాంపెయిన్ చేస్తారు. రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాలలో పర్యటించి మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరతారు.

ఇలాంటి పద్ధతి  కమ్యూనిస్టు పార్టీలలో జరుగుతూ ఉంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితం అవుతారు.

ఇలాగే కోదండ రామ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా టిజెఎస్ అభ్యర్థుల విజయానికి, మహా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారు.