మళ్లీ కన్ను కొట్టి కవ్వించిన ప్రియా వారియర్ ( కొత్త వీడియో)

ప్రియా వారియర్ మళ్లీ కన్ను కొట్టి కవ్వించింది. ముద్దులతో ముంచెత్తింది. గతంలో ఇలా కన్ను కొట్టి కోట్లాది మందిని పడేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. తాజాగా ఆమె మళ్లీ తెర మీద కన్ను కొట్టి ముద్దులు విసిరి హల్ చల్ చేస్తోంది. ఆ వివరాల కోసం చదవండి. వీడియో చూడండి.

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ నటించిన తొలి చిత్రం ఒరు ఆదార్ ల‌వ్‌. ఈ మ‌ల‌యాళ మూవీలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాట‌లో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో యువ‌త గుండెల్లో బాణాలు దించింది ప్రియా. 18 ఏళ్ళ ఈ భామ‌కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ రోజు రోజుకి పెరుగుతూ పోతున్నారు. ఈ అమ్మ‌డు న‌టించిన ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ఇప్పుడు ఈ చిత్రంలోని 40 శాతం స‌న్నివేశాల‌ని రీ షూట్ చేయాల‌ని చిత్ర బృందం భావించింద‌ని చెబుతున్నారు. ఒరు ఆదార్ మూవీలో మొత్తం న‌లుగురు హీరోయిన్స్ ఉండ‌గా అందులో ప్రియా వారియ‌ర్ ఒక‌రు. సినిమాలో ఆమె పాత్ర కేవ‌లం 15 నుండి 20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. అయితే క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ప్రియా పాత్ర‌ని కాస్త పెంచి మూవీపై జ‌నాల‌లో ఆసక్తిని క‌లిగించాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ప్రియా కొత్త వీడియో పైన ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *