హైదరాబాద్ OU లో ఏం జరుగుతున్నదో తెలుసా…

 ఉస్మానియా యూనివర్శిటీ పిహెచ్ డీ ధీసిస్ ల్లో కాపీ సరకే ఎక్కువగా ఉందనే సంచలన విషయం బయటపడింది.ధీసిస్  దాదాపు సగం కాపికొట్టిందే అయితే, మరికొన్నింటిలో దాదాపు 90 శాతం దాకా కాపీయే ఉస్మానియాలో కొత్త అమలులోకి తీసుకువచ్చిన ప్లేజయరిజరం చెక్ సాఫ్ట్ వేర్ బయటపెట్టింది.
అయితే,దేశం లోని చాలా విశ్వవిద్యాలయాల   పిహెచ్ డిలలో కాపి చేసినవే ఎక్కువగా ఉన్నాయనే  విమర్శలు ఎక్కువకావడంతో నివారణకు యుజిసి చర్యలు ప్రారంభించింది, కొంత మంది వైస్ చాన్స్ లర్లు కూడా పేక్ దీసిస్ లు సమర్పించినట్లు బయటపడటంతో యూజిసి ఈ మధ్య ప్లేజయరిజం చెక్ తప్పనిసరి చేసింది.
దీనితో ఉస్మానియా యూనివర్శిటీ కూడా పిహెచ్ డిలు ఎంతగా కాపి అండ్ పేస్టు బాపతో కొనుగొనేందుకు చర్యలు మొదలుపెట్టింది.
ఈ చెక్ ఫలితంగా ఉస్మానియా యూనివర్శిటీ కాపి పిహెచ్ డిల ఫ్యాక్టరీ అని తేలింది.
దేశంలో ప్రతిష్టాకరమయిన విశ్వవిద్యాలయాలలో ఉస్మానియా ఒకటి. విశాలమయిన, అందమయిన క్యాంపస్, రాజసం ఉట్టిపడేలా  ఉండే భవనాలు ఉస్మానియా సిగ్నేచర్. అంతేకాదు,  చదువులో, పరిశోధనలో కూడా ఉస్మానియా ఒకప్పుడు దక్షిణాది హిమాలయం.
ఇపుడు కథ తలకిందులవుతా ఉందని ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేజరిజం సాఫ్ట్ వేర్ బయటపెట్టింది.
యూనివర్శిటీకి సమర్పించిన ప్రతి పి హెచ్ డి సిద్ధాంత వ్యాసంలో 30 నుంచి 40 శాతం సరుకు కాపీ లాగా కనిపిస్తూ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక వార్త ప్రకారం ఉస్మానియా ప్రతిసంవత్సరం సుమారు 400 మందికి డాక్టరేట్ లు ప్రదానం చేస్తుంది. అంటే, కాపి పిహెచ్ డిల ఫ్యాక్టరీగా ఉస్మానియా యూనివర్శిటీ తయారయిందనేగా అర్థం.
గత ఏడాది జూలైలో ఉస్మానియా ఈ కాపి కుంభకోణం మీద కొరడా ఝళిపిస్తూ కాపీని గుర్తుపట్టే సాఫ్ట్ వేర్ Turnitin ను ప్రవేశపెట్టింది. ఇది యాంటి ప్లేజయరిజం సాఫ్ట్ వేర్.
ప్రతి ధీసిస్ లో కాపి సరుకు ఏమోతాదో లు ఎంతవుందో ఇది చెబుతుంది. ఇక నుంచి  ప్రతి ధీసిప్ ను దీనితో బేరీజు వేసి చూడాల్సిందే నని అని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రామచంద్రం యుజిసి నిమమాల ప్రకారం  ఒక షరతు పెట్టారు.
 ఈ ఏడాది కాలంలో దాదాపు 900 ధీసిస్ లను యూనివర్శిటీ వెరిఫై చేసింది. ఇందులో 200 సిద్ధాంత వ్యాసాలు  కాపి గొట్టి రాసినవేనని ఇందులో కాపి కంటెంట్ 40 నుంచి 50 శాతం దాకా ఉందని కనుకొన్నారు.
సగం ధీసిస్ కాపియే నన్నమాట. కొన్ని ధీసిస్ లలో నయితే కాపీ అని  రుజువు చేస్  ‘సిమిలారిటీ ఇండెక్స్’ 75 శాతం నుంచి 90 శాతం దాకా ఉండటం చూసిడంగై పోయారు అధికారులు.
ఉదాహరణకు ఒక జర్నలిజం పిహెచ్ డి దీసిస్ ను తీసుకోవచ్చు. ఒక రీసెర్చ్ స్కాలర్ మీడియా ఆర్గనైజేషన్స్ మీద పిహెచ్ డి చేశారు. ఆయన మొదటి డ్రాఫ్ట్ ను సమర్పించారు. దీనిని ప్లేజయరిజం చెక్ చేశారు. దీని సిమిలారిటి ఇండెక్స్ ఎంతో తెలుసా? 90 శాతం. ఈ రీసెర్చ్ స్కాలర్ కంప్యూటర్ టెక్నాలజీని సమృద్ధిగా ఉపయోగించుకుని ఎవరో రాసిన రీసెర్చ్ పేపర్ల నుంచి, బ్లాగులనుంచి, వెబ్ సైట్ల నుంచి  మస్తు  కాపీ అండ్ పేస్ట్ అప్లై చేసి ధీసిస్ సబ్మిట్ చేశాడు.
ఇదే అన్ని శాఖల్లో జరుగుతూ ఉంది. డెజర్టేషన్ రాసేవాళ్లు చాప్టర్లకు చాప్టర్లు కాపీ కొడుతున్నారు. బ్లాగ్స్ నుంచి, న్యూస్ అర్టికిల్స్ నుంచి,ఇతర రీసెర్చ్ పేపర్ల నుంచి  కాపీ కొట్టేస్తున్నారు. ధీసిస్ లో ఇంట్రొడక్షన్, లిటరేచర్ రివ్యు, డిస్కషన్ చాప్టర్లను బాగా కాపి కొడుతున్నారని యాంటి ప్లేజయరిజం సాఫ్ట్ వేర్ కోర్డినేటర్ ఎఎస్ చక్రవరి ‘టైమ్స్’ కు  చెప్పారు.
ఒక సారి ప్లేజయరిజం టెస్ట్ జరిపాక రీసెర్చ్ స్కాలర్లు మూడుసార్లు తమ ధీసిస్ ను తిరగరాయవచ్చు. అయితే, కొంత మంది పది సార్ల దాకా రాస్తున్నారని చక్రవర్తి చెప్పారు.
పిహెచ్ డి లో కాపికొడితే ఏమవుతుంది?
2018 లో యుజిసి యూనివర్శటీలలో అకడమిక్ స్టాండర్డ్ పెంచేందుకు, కాపీ కొట్టడం నిషేధించేందుకు యాంటి ప్లేజయరిజం మార్గదర్శకాలు రూపొందించింది.
దీనితో Turniti సాఫ్ట్ వేర్ ను యూనివర్శిటీలు వాడి పిహెచ్ డి లో కాపీ సరుకెంతో కనుగొనే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయయంలో ఈ సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టారు.
యుజిసి నియమాల ప్రకారం ధీసిస్ లో 10 నుంచి 40 శాతం కాపీ ఉంటే డ్రాఫ్ట్ ను ఉపసంహరించుకోవాలి. ఇలాంటి డ్రాఫ్ట్ వచ్చాక టీచర్ రెండేళ్ల పాటు పిహెచ్ డిలను సూపర్ వైజ్ చేయకుండా నిషేధించాలి. ఇదే కాపీ కంటెంట్ 40 నుంచి 60 శాతం ఉంటే గైడ్ కు ఒక ఇంక్రిమెంట్ కట్ చేయాలి. రీసెర్చ్ స్కాలర్లకు సంబంధించి కాపీ కంటెంట్ 10 నుంచి 40 శాతం ఉంటే దీసిస్ ను తిరగరాసి పంపించాలి. 40 నుంచి 60 శాతం కాపీ సరుకు ఉంటే ఒక ఏడాది విద్యార్థిని డీబార్ చేస్తారు. కాఫీ కంటెంట్ 60 పైగా ఉంటే పిహెచ్ డి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి.
వైస్ చాన్స్ లర్ డిస్మిస్
ఇండియాలో కాపీ పిహెచ్ డిలు చాలా ఎక్కువయ్యాయి. ఇలా కాపీ కొట్టి పిహెచ్ డిలు సంపాదించి వైస్ చాన్స్ లర్లయిన వాళ్లూ ఉన్నారు. 2018 ఆగస్టులో రాజ్యసభలో ఒక ప్రశ్నకు  రాత పూర్వక సమాధానమిస్తూ మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడించారు.
ఇద్దరు వైస్ చాన్స్ లర్లు కూడా తమ పిహెచ్ డిలను కాపీ కొట్టి సంపాదించినట్లు యుజిసి కనుగొనిందని మంత్రి సభకు చెప్పారు.
అందులో పాండిచ్చేరి వైస్ చాన్స్ లర్ చంద్రకృష్ణ మూర్తి (2015),అనిల్ కుమార్ ఉపాధ్యాయ్, మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్,వారణాసి (2017), వినయ్ కుమార్ పథక్, వైస్ చాన్స్ లర్, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్శిటీ , లక్నో (2018) ఉన్నారు. వీరిలో చంద్రకృష్ణమూర్తిని జూలై 2016 లో డిస్మిస్ చేశారు.మిగతావాళ్ల మీద చర్యలు తీసుకోమని ఆదేశించారు.
(ఈ స్టోరీ మీకు నచ్చితే షేర్ చేయండి. trendingtelugnews.com ను ఫాాలో కండి)