IPS కు ఎంపికయిన PIZZA HUT డెలివరీ బాయ్…

మిరకిల్స్ ని అంటే అద్భతాలను సృష్టింవచ్చని, దానికి మానవాతీత శక్తులుండాల్సిన అవసరం లేదని మోయిన్ ఖాన్ జీవితం చెబుతుంది.
కాకపోతే, ఏం సాధించాలో లేదా ఏం సృస్టించాలో తెలుసుకుని దానికి తగ్గట్టు తపస్సు చేయాలి. అంతే, అద్భుతాలు స‌ృష్లించవచ్చు.
మోయిన్ ఖాన్ (28) ఇలా చేసి, మిరకిల్ లాగ ఈ ఏడాది ఐపిఎస్ కు ఎంపికయ్యాడు.
నార్మల్ గా మోయిన్ ఖాన్ జీవిస్తున్న జీవితంలో బంగారు బతుకు గురించి కలలు కనడం కష్టం అలాంటి కలలురావు.
ఆయన రు. 2500 లకు పీజాడెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సంవత్సరం కాదు, ఏడేళ్లు ఆ ఉద్యోగం చేశాడు. అయితే,ఎపుడూ కృంగిపోలేదు.
ఆయనకు తన గోల్, తను సృస్టించాల్సిన మిరకిల్ తప్ప మరొకటి కనిపించేది కాదు. అందుకే ఆయన ఐపిఎస్ ఈజీ సెలెక్టయిపోయాడు. దీన్ని చూసి ఆయన కు కోచింగ్ ఐపిఎస్ ఆఫీసరే అదిరిపోయాడు.
తీవ్రవాదం, సైన్యం తప్ప సాంఘిక జీవితం పెద్దగా కనిపించని కాశ్మీర్ లో ఆయన ఖాకి డ్రెస్ ఆకట్టుకుందేమో… మోయిన్ ఖాన్ ఐపిఎస్ కావాలనుకున్నాడు.
చాలా పేద కుటుంబం నుంచి వచిన ఖాన్ కు ఇది హిమాలయమంతా గోల్. ఇంటిని ఆదుకునేందుకు, తన చదువు కొనసాగించేందుకు ఖాన్ కిరాణ షాపుల గుమాస్తాగా, కారు వాషర్ గా, పిజ్జా డెలివరీ బాయ్ గా ఏడేండ్లు కష్టపడ్డాడు.
ఆయనకుటుంబం పెద్ద చదువులకు ఏ మాత్రం అనుకూలంగా లేదు. వాళ్లది జమ్ముజిల్లాలోని నగ్రోతా జిల్లా ఠండాపాని గ్రామమే అయినా తండ్రి మహమ్మద్ షరీఫ్ ఎక్కడో గుజరాత్ లో బతుకు దెరువు వేటలో ఉన్నాడు. మొదట పాలమ్మాడు. తర్వాత చిన్న దాబా పెట్టాడు. అయితే, దురదృష్టం ఆయన్ని అక్కడా వదల్లేదు. 2009లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీని తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యత ఖాన్ మీద పడింది. దీనికి తోడు ఖాన్ సోదరుడు డౌన్స్ సిండ్రోమ్ జబ్బు ఉంది. ఇట్లాంటి కుటుంబాన్ని చూసుకుంటూ తన చదువు కొనసాగించాలి.
2012లో ఖాన్ కరెస్సాండెన్స్ స్కూల్ నుంచి బికామ్ పూర్తి చేశాడు. వెంటనే పిజాహట్ లో రు. 2500 లకు చేరాడు. ఇలా మూడేళ్లు పనిచేశాడు.
ఉద్యోగం చేస్తూ బిబిఎ కూడా పూర్తి చేశాడు. రోజూ సాయంకాలం ఆరు నుంచి తెల్లవారుజామున 2 దాకా అంటే నైట్ డ్యూటీ చేసేవాడు. అపుడు కార్ వాషింగ్ పనిచేస్తున్న మిత్రుల రూంలో తలదాచుకునే వాడు. తర్వాత వాళ్లతో కార్ వాషింగ్ పని చూడా మూడేళ్లు చేశాడు.
2016లో సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల పరీక్ష కు హాజరయ్యాడు. దానికి ప్రిపేరవుతున్న సమయంలో ఒక మిత్రుడు ఆయన Operation Dreams గురించి విన్నాడు. ఆపరేషన్ డ్రీమ్స్ అనే సంస్థ పేద విద్యార్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇచ్చే సంస్థ.

ఈ అర్ధరాత్రి చంద్రుని మీద Fifteen Minutes Terror సస్పెన్స్ ధ్రిల్లర్, తప్పక చూడండి

దీనిని 2012 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ సందీప్ చౌదరి జమ్ము లో ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని ఖాన్ ఉపయోగించుకున్నాడు. సివిల్స్ పాసయ్యాడు. ఇపుడు ఉధంపూర్ జిల్లాలో పనిచేస్తున్నాడు. ఈ కోచింగ్ సెంటర్ లో చౌదరి ఉదయం ఎనిమిది నుంచి 10 గంటల దాకే కోచింగ్ ఉంటుంది. ఈ గైడెన్స్ లో ఖాన్ సివిల్స్ కొట్టేశాడు.
ఖాన్ బాగా కష్టపడి చదువుతాడు, ఖాన్ ను చూసి నేను గర్వపడతానని సందీప్ చౌదరి వ్యాఖ్యానించారు. ఏ మంటారు, కఠోర తప్పస్సు తో సాధించిన అద్బుతం కాదా ఇది?

తెలంగాణ మోటివేషనల్ సూపర్ స్టార్ … గంజి భాగ్య లక్ష్మి గురించి చదవండి