NEWS BRIEF బిఆర్ కె భవన్ నుంచి పరిపాలన షురూ

హైదరాబాద్  బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి తెలంగాణ సచివాలయ కార్యకలాపాలు షురూ అయ్యాయి.
కార్యాలయాల తరలింపు పూర్తై కార్యదర్శులు ఇక్కడినుంచే తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ ఉదయం బీఆర్కే భవన్​కు వచ్చి తన ఛాంబర్​ను పరిశీలించి కాసేపు అక్కడే ఉండి కుందన్​బాగ్​లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి అదర్ సిన్హా, వైద్య-ఆరోగ్య శాఖా కార్యదర్శి శాంతికుమారి తదితరులు బీఆర్కే భవన్​లోని తమ ఛాంబర్లకు వచ్చారు. పేషీలు ఇంకా పూర్తి స్థాయిలో తరలింపు పూర్తి కాకపోవడంతో కొంత మంది ఉద్యోగులు సచివాలయం నుంచే పని చేయనున్నారు. తరలింపు ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతోంది. మరోవైపు బీఆర్కే భవన్​లో మరమ్మతులు జరుగుతున్నాయి. బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ట్రాఫిక్​ను పరిశీలించి వాహనాల రద్దీ, పార్కింగ్ తదితర విషయాలను గమనించారు.

లక్ష్మి పార్వతి ఎక్కడ?

వైసిపి అఖండ విజయం సాధించాకా, జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక, ఆయన మద్దతుదారులందరితో పాటు చంద్రబాబు నాయుడు విమర్శకులంతా పండగ చేసుకుంటున్నారు. అవును ఆయనకు వచ్చినా మెజరిటీ అలాంటిది.వైసిపికి మద్దుతనిచ్చిన వారికి, చంద్రబాబు ను దించడంలో సహకరించిన వారికి ఏదో ఒక పదవిలభిస్తూఉంది.
కొందరికి పార్టీలో, మరికొందరికి ప్రభుత్వంలో,ఇంకొందరికి ప్రభుత్వ కార్పొరేషన్లలో పదవులొచ్చాయి.రాజకీయంగా బాగా ఉపయోగపడతారనుకునే వాళ్ళని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తున్నారు. ఈ పండగ వాతావరనంలో ఒక్క పేరే వినిపిండం లేదు. ఆమెయే నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు ఓడిపోవాలని జగన్ లాగా చాలా గట్టిగా కోరుకున్న వ్యక్తి ఆమె. దీనికోసం ఆమె వైసిపిలో కూడా చేరారు.
అయినా,సరే పండగవాతావరణంలో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఆమె పేరూ వినిపించడంలేదు. చివరకు ఆమె ముఖ్యమంత్రి జగన్ కలుసుకున్నట్లు కూడా వార్తలు రావడం లేదు. ఎందరో మహిళలకు పదవులిస్తున్న జగన్ కు ఇంకా లక్ష్మీపార్వతి గుర్తుకురాకపోవడం ఆశ్యర్యంగా నే ఉంది.
అల్లుడు చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఆమె విరచుకుపడింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు విరుచుకుపడింది. ఈ విషయంలో ఆమె వైసీపీ నేతల ప్రశంసలందుకున్నారు.ఎన్నికలకు ముందుకు బాగానే ఉండింది. ఎన్నికలయిన వైసిపి గెలిచాకనే ఆమె తెరమరుగయ్యారు.
ఎన్టీఆర్ పేరుతో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు పెట్టిన అన్నక్యాంటీన్లను జగన్ ప్రభుత్వం రద్దుచేసినా ఆమె పట్టించుకోలేదు. పోతే పోయిందిలే అనుకున్నట్లుంది.ఆది మా ఆయన పేరు పూర్తి గా చెరిపోయవద్దు, ఒకటో రెండో ఉంచడని అడిగినట్లు కూడా ఎక్కడ వార్తల్లో కనిపించలేదు. విచిత్రంగా ఉంది కదూ?

https://trendingtelugunews.com/pawak-kalyan-asks-why-nellore-ycp-mla-kotamreddy-was-not-booked/