జూలై 25న నాగార్జున ర‌కుల్ ప్రీత్ సింగ్ `మ‌న్మ‌థుడు 2` ట్రైల‌ర్ 

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో టీజ‌ర్‌కి.. అవంతిక అనే పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌లై హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఈ నెల 25న ఈ సినిమా ట్రైల‌ర్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
కింగ్ నాగార్జున‌
ర‌కుల్ ప్రీత్ సింగ్‌
ల‌క్ష్మి
వెన్నెల‌కిషోర్‌
రావు ర‌మేష్‌
ఝాన్సీ
దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌:  సి.వి.రావ్‌