ప్లీజ్ విక్రమ్, వెంటనే స్పందించాలి : నాగపూర్ పోలీసుల నోటీసు

చంద్రమండలం మీద సిగ్నల్స్ జంప్ చేసి  దారి తప్పిపోయిన విక్రమ్ ల్యాండర్ కు నాగపూర్ పోలీసులు ఒక ట్విట్లర్ నోటీసు పంపారు. ఎక్కడున్నా వెంటనే స్పందించాలని వారు వార్నింగ్ ఇచ్చారు.
’డియర్ విక్రమ్ , దయచేసి స్పందించాలి.
సిగ్నల్స్ బ్రేక్ చేసినందుకు నీకు ఎలాంటి చలాన్ విధించం’ అని వారు పిలుపు నిచ్చారు.
వందలాది మంది సైంటిస్టుల కన్నుగప్పి, చంద్రోపరితలానికి 2.1 కి.మీ ఎత్తులో ఉన్నపుడు విక్రమ్ ల్యాండర్ సిగ్నల్ జంప్ చేసిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి విక్రమ్ ను పట్టుకునేందుకు ఇస్రో శత విధాల ప్రయత్నిస్తూ ఉంది.
ఆచూకి తెలిసినా విక్రమ్ తో సంబంధాలు పునరుద్ధరించుకోవడం కష్టంగా ఉంది.
  ఇస్రో సిగ్నల్స్ కు విక్రమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. అందుకే నాగపూర్ పోలీసులు రంగంలోకి దిగారు  !!!.

ఇపుడే అందిన వార్త (4.25 pm)

చంద్రుని మీద దిగబోతూ 2.1 కిమీ ఎత్తున దారి తప్పిన విక్రమ్ ల్యాండర్ గురించిన మరింత సమాచారం అందింది. విక్రమ్ చంద్రుడి ఉపరితలం మీద చెక్కుచెదరకుండా ఒకే పరికరంగా పడి ఉందని, అది పగిలిపోలేదని, కాకపోతే ఒక్కకు ఒరిగి ఉందని ఇస్రోకు సమాచారం అందింది.
నెమ్మెదిగా దిగలేక దబల్లున పడిపోవడంతో అది పక్కకు ఒరిగిపోయిందని ఇస్రో అధికారి ఒకరు ఈ రోజు వెల్లడించారని సమాచారం.
విక్రమ్ తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
చంద్రోపరితలానికి 2.1 కి. మీ ఎత్తున ఉన్నపుడు విక్రమ్ ల్యాండర్ తో భూమితో సంబంధాలు తెలిపోయాయి. విక్రమ్ లోపల ప్రజ్ఞాన్ రోవర్ దాగి ఉంది. ఈ నేల ఏడో తేదీన విక్రమ్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన ప్రజ్ఞాన్ ను బయటకు విడుదల చేయాలి.
ల్యాండర్ ఒకే ముక్కగా చంద్రుడి ఉపరితలం మీద కుప్పకూలి ఉంది. అది ముక్కలయిపోలేదు. కాకపోతే, పక్కకు వొరిగి ఉందని ఈ మిషన్ తో సంబంధం ఉన్న అధికారి ఒకరు చెప్పారు
విక్రమ్ తో కమ్యూనికేషన్ సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
చంద్రయాన్ 2 మిషన్ మూడు భాగాలున్నాయి. అవి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఇందులో అర్టిటర్ సురక్షితంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంది. ఇపుడు దారితప్పిన ల్యాండర్ రోవర్ ఒక చంద్రదినం అంటే, 14 భూదినాలతో సమానం.
ఈ పద్నాలుగు రోజులలో విక్రమ్ తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి.