చంద్రబాబు వైస్రాయ్ హోటల్ ఘటనపై మోహన్ బాబు హాట్ కామెంట్స్

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ దుయ్యబట్టారు. జగన్ ని గెలిపించమని ఓటర్లను అభ్యర్ధించారు. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలో చెరిగిపోని మచ్చగా మిగిలిన వైస్రాయ్ హోటల్ ఘటన గురించి వెల్లడించారు. మీడియా ఎదుట మోహన్ బాబు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.

నా మిత్రుడు చంద్రబాబు నాయుడు ఉదయం నుండి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ అనటం తప్ప మరేమీ చెప్పడు. చంద్రబాబూ… ముందు నేను… నేను… అనే అహంకారాన్ని వదలిపెట్టు చంద్రబాబు. నీకంటే నేనే ముందు తెలుగుదేశం పార్టీలో చేరాను.

జగన్మోహన్ రెడ్డి పై 36 కేసులు ఉన్నాయంటున్నావు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు? నీ కేసులలో ఇప్పటిదాకా స్టే లు ఎందుకు తీసివేయలేదు?
ఎదుటివారు బాగుంటే ఓర్వలేని చంద్రబాబు.

నీకు కారెక్టర్ ఉందా చంద్రబాబు? తెలుగుదేశాన్ని లాక్కున్నావు. మేము నీ వెంట రావటం మా తప్పు మళ్ళీ ఒప్పుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మునిగిపోతుంది అంటే… చంద్రబాబు నాయుడు నీ వల్లనే.

కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించిన అన్న గారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించావు. చంద్రబాబుది కుటుంబ పరిపాలన. హరికృష్ణ కు నీవు ఏం చేశావో ఇప్పటికైనా ప్రజలకు చెప్పు.

యూటర్న్ చంద్రబాబు…మోడీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న నువ్వు మోడీ తో జతకట్టడం ఎంతవరకు సమంజసం? కేంద్రప్రభుత్వం నిధులకు లెక్కలు చెప్పవద్దా? నువ్వు చెప్పవా?

ఆపధర్మ ముఖ్యమంత్రి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎలా ఇస్తారు? అమరావతి రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలని ఎంచుకోవడం న్యాయమేనా? ఆంధ్ర దేశాన్ని దోచేశావు చంద్రబాబు.

కేసీఆర్ తెలంగాణకు మంచి చేస్తున్నాడు. నీ రాష్ట్రాన్ని నువ్వు బాగు చెయ్యి. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి భయపడి పారిిపోయావు చంద్రబాబు నాయుడు.

వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించడం నాకు తెలుసు. చంద్రబాబు ఎన్ని మోసాలు అయినా చేస్తాడు. ఎన్టీఆర్ ముందు వడ్డించిన ఇస్తరిని లాకున్నావ్. ఎన్టీఆర్ ఫ్యామిలీలో అమాయకులు అందుకే త్వరగా మోసం చేయగలిగాడు.

మా అందరి కష్టంతో పెరిగిన టీడీపీ ని చంద్రబాబు దొంగలా లాక్కున్నాడు. లక్మిస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో అడ్డుకున్నారు. తెలంగాణలో అద్భుతంగా ఆడుతుంది.

ఎన్టీఆర్ కి కష్టకాలంలో అన్ని రకాలుగా లక్మి పార్వతి తోడుగా ఉంది. అప్పట్లో నేను చేసిన పనికి ఆమె కడుపు మండి తిట్టి ఉంటుంది. నాకు, ఆవిడకి విబేధాలు రేపడానికి ప్రయత్నిస్తున్నారు.

చదువు, ఆరోగ్యం కోసం రాజశేఖర్ రెడ్డి గారు తాపత్రయ నిజం. వైయస్సార్ హయాంలో ఫీజు రీయంబర్స్ మెంట్ ,ఆరోగ్యశ్రీ అనేవి పేద వర్గాలను విపరీతంగా ఆదుకున్నాయి. చంద్రబాబూ..నీవు పెట్టిన రెండు పధకాలు అలాంటివి చెప్పగలవా?

జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వండి.. తానేంటో నిరూపించుకుంటాడు. 10 ఏళ్ళు ప్రజల్లో వుండి ప్రజలకి ఏమికావాలో తెలుసుకున్నాడు. ప్రజలకు మంచి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి. ఇది ప్రజలకు నేనిచ్చే సందేశం.

నా దృష్టిలో ఏపీలో వైసీపీ టీడీపీ రెండే పార్టీలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యం. వేరే పార్టీల గురించి నేను మాట్లాడను.

రాష్ట్రంలో పోటీ ఉన్నది రెండే పార్టీల మధ్య. వచ్చే ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తుంది. జగనే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని ధీమా వ్యక్తం చేశారు మోహన్ బాబు.

ఈ సంచలన వార్త చదవండి…

https://trendingtelugunews.com/new-twist-on-cm-kcr-phone-discussion-on-sharath/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *