ఎడుకొండల వాడు నా ఇష్టదైవం, అయినా తప్పకుంటున్నా: ఎమ్మెల్యే అనిత

క్రిష్టియన్  వివాదం ముదరడంతో  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి  పాయకరావు పేట టిడిపి ఎమ్మెల్యే వి. అనిత తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. రెండు రోజుల కిందట నియమించిన టిటిడి సభ్యుల పేర్ల లో అనిత పేరుంది. అయితే, తాను క్రిష్టియన్  ను అని ఎపుడూ బైబిల్ తోనే తిరుగుతుంటానని ఆమె చెప్పిన వీడియో బయటపడటంతో హిందూ ధార్మిక సంస్థలు, ఇతర సంఘాల వారు అభ్యంతరం చెప్పారు.  ఆమె రాసిన లేఖ:

నా మీద నమ్మకం తో దళిత మహిళని అయిన నన్ను నా ఇష్ట దేవమైన వెంకటేశ్వర స్వామి సేవ చేసుకొనే అవకాశం టీటీడీ బోర్డు మెంబెర్ గా నిమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్న.

కానీ కొన్ని దుష్ట శక్తులు నా మీద నేను నమ్మే మతం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను హిందువు ని అయినప్పటికీ కట్ పేస్ట్ చేసిన వీడియో ని సోషల్ మీడియా లో పెట్టి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు.

ఈ దరిమిలా…నా నాయకుడు ఐన చంద్రబాబు నాయుడు గారిని ఎమి చేయలేక 14 సెకెనుల వీడియో ని చూపించి గవర్నమెంట్ ని సీఎం గారిని తప్పు పట్టడం చేస్తున్నారు.

అందువలన నేనే ఈ టీటీడీ బోర్డు మెంబెర్ గా తప్పుకుంటున్నానని వినమ్రతతో తెలియచేస్తున్నా.నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నాకు ఎంతోమానసిక ధాయిర్యాన్ని ఇచిన నా తెలుగు దేశం కార్యకర్తలకి నా పాదాభివందనములు తెలియచేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ

-మీ సహోదరి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *