టిడిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టుల అల్టిమేటమ్

ఆరకు తెలుగు దేశం ఎమ్మెల్యే కిడారి,  మాజీఎమ్మెల్య సోమాలను హత్య చేసిన మావోయిస్టు పార్టీ మరొక ఎమ్మెల్యేకి అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ మావోయిస్టుల టార్గెట్ ఒక మహిళా ఎమ్మెల్యే , పాడెేరు ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి.   ఈ  అల్టిమేటమ్ తో మావోలు ఒక బహిరంగ లేఖ విడదల చేశారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో  ఈ లేఖ వచ్చింది.  చిత్రంగా మావోయిస్టుల పార్టీ ఫిరాయింపును కూడా పెర్కొంటూ అధికారానికి డబ్బుకు అమ్ముడు పోయిన ఎమెల్యేగా ఈశ్వరిని వర్ణించడం ఆశ్చర్యం.

వైసిపి నేతగా గిడ్డి ఈశ్వరి

గిడ్డి ఈశ్వరి వైసిపి తరఫున 2014 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లోచేరారు.

ఎమ్మెల్యేగా ఈశ్వరి తెలుగుదేశంలో చేరుతున్నప్పటి నుంచి ఫోటో…

‘పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అధికారానికి 20 కోట్లకు అమ్ముడు బోయింది. ఆమె బాక్సైట్ కు వ్యతిరేఖంగా ఉద్యమం చెయ్యాలి. పద్దతి మార్చుకోక పోతే కిడారికి, సోమాకు పట్టిన గతే పడుతుంది,’ అని మ ావోయిస్టులు బెదిరించారు.

కిడారి మీ గురించి అన్నీ చెప్పాడని కూడా ఆమెకు  వారు వివరించారు.

ఇలా తీసుకున్న ఆ డబ్బు రెండు నెలల్లో గిరిజనులకు పంచి పెట్టాలని వారు షరతు కూడా పెట్టారు.

కిడారి, సోమల హత్య గురించి చెబుతూ వారు గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందుకే ప్రజా కోర్టులో శిక్ష విధించామని చెప్పారు.

‘కిడారి బాక్సైట్ కు అనుకూలంగా మారుతున్నారు..గూడ క్వారీ విషయంలో ఎన్నో సార్లు హెచ్చరించాం..అయినా పద్దతి మార్చుకోలేదు.పోలీసులకు మాకు ఎటు శత్రుత్వం లేదు.అందుకే అయుదాలతో దోరికినా ఎటువంటి హానీ పోలీసులకు చెయ్యలేదు.బాక్సైట్ తొవ్వకాలకు ఎవ్వరూ అనుకూలంగా ఉన్నా వదిలేది లేదు,’ అని వారు లేఖలో పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *