ఎన్నికల డేట్ మార్చేసిన లోకేష్: షాక్ లో తమ్ముళ్లు (వీడియో)

ఏపీ సీఎం కుమారుడు నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. గతంలో పలుమార్లు లోకేష్ నోటి నుండి తప్పులు దొర్లాయి. దీంతో నెట్టింట్లోనూ, వైసీపీ వర్గాల్లోనూ అబాసుపాలయ్యారు లోకేష్. ఆయన తెలుగు గురించి అనేక ట్రోల్స్ వచ్చాయి.

వీటికి బ్రేకులు వేయడానికి ప్రత్యేకంగా తెలుగు టీచర్ తో లోకేష్ కి శిక్షణ కూడా ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. లోకేష్ నోటి నుండి గురువారం మరో ఆణిముత్యం రాలింది.

రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు లోకేష్. గెలుపుదిశగా మంగళగిరిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు లోకేష్. ఈ ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 9 న తనకు వోట్ వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఏప్రిల్ 11 న ఎలక్షన్స్ కానీ నారా లోకేష్ 9 న అనడంతో తెలుగు తమ్ముళ్లు షాక్ అయ్యారు. తర్వాత ఏప్రిల్ 9 తో ప్రచారం ముగుస్తుంది. ఏప్రిల్ 11 న పోలింగ్ అని తన తప్పును సవరించుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *