నిజామాబాద్ లోె కవిత ఎందుకు ఓడారో చెప్పిన కెటిఆర్

లోక్ సభ ఎన్నికల్లో పదహారు స్థానాలకు బదులు కేవలం 9 స్థానాల్లోనే టిఆర్ ఎస్ గెలవడం ఎదురు దెబ్బ కాదని పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రామారాావు అన్నారు.
తెలంగాణలో బిజెపికి ఓట్లు బాగా పడటానికి కారణం ప్రధాని మోదీయేనని ఆయన అంగీకరించారు. బీజేపీ కి కార్యకర్తలు లేని చోట్ల కూడా ఆ పార్టీ కి ఓట్లు పడ్డాయని, శేరి లింగం పల్లి లాంటి నియోజకవర్గం లో బీజేపీ కి 50 వేల ఓట్లు పడ్డాయని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ లోక్ సభ సీటు గెలుస్తామని బీజేపీ కూడా ఉహించిఉండదని ఆయన అన్నారు.  ఎన్నికల ఫలితాల గురించి ఇంతవరకు టిఆర్ ఎస్ అధికారికంగా వ్యాఖ్యానించలేదు. అందువల్ల ఆయన ఈ రోజు టిఆర్ ఎస్ ఎల్ పి కార్యాలయంలో మీడియాతో  మాట్లాడుతూ  పార్టీ అభిప్రాయం వెల్లడించారు. ఆయన ఇంకా చాలా చెప్పారు. ఆ విశేషాలు ఇవే:
….2014 పార్లమెంటు ఎన్నికల్లో 34 శాతం ఓటు trs కు వచ్చింది .11 సీట్లు గెలిచాం.అప్పటికంటే ఇపుడు ఆరు శాతం ఓట్లు పార్టీ కి పెరిగినా 9 సీట్లే గెలిచాం.అందరూ బాగా కష్టపడ్డారు .అయినా ఫలితం ఇలా వచ్చింది.
…కాంగ్రెస్ గెలిచిన మూడు సీట్లలో రెండు సీట్లు వెంట్రుక వాసి తేడా తో గెలిచింది.
…విచిత్రమైన ట్రెండ్ ఈ ఎన్నికల్లో కనిపించింది.ఈ ఫలితాలు trs కు ఎదురు దెబ్బ కాదు.రాహుల్ గాంధీ ,దేవెగౌడ లాంటి వాళ్ళే ఓడిపోయారు. .కొందరు ముఖ్యనేతలు ఓడిపోతే trs కార్యకర్తల నైతిక స్థయిర్యం దెబ్బతింటున్నదనేది నిజం కాదు. మేము ఇలాంటి ఫలితాలు ఊహించలేదు. అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనేది వాస్తవం కాదు
…సిరిసిల్ల లో బీజేపీ అభ్యర్థి కి 3 వేల ఓట్లు పడితే ఇపుడు 50 వేలు పడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కూటములకు రకరకాల కారణాలు ఉన్నాయి .ఒక్క కారణం అని చెప్పడానికి లేదు. ఎన్నికల్లో పదహారు కు పదహారు గెలిచినా కేంద్రం లో ఏం చేయలేని పరిస్థితే.మోడీ నేతృత్వం లోని ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరం లేదు.
…trs కార్యకర్తలు ఎవరూ కుంగిపోవాల్సిన పని లేదు.అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో trs కు నాలుగు లక్షల ఓట్లు తగ్గాయి.నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా విఫలమయ్యానని అనుకోవడం లేదు.గతం లో విజయాలు సాధించినప్పుడు ఎవరూ కిరీటాలు పెట్టలేదు.స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోతైన సమీక్ష చేస్తాం.
…ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం.సింహభాగం సీట్లు గెలుస్తాం.రాష్ట్రాలు ఎంత బలపడితే దేశానికి అంత మంచిది.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర సమర్ధంగా పోషించే స్థితి లో లేదు. ఇది ఓ రకంగా ఫెడరల్ స్ఫూర్తి కి మంచిదే.కేంద్రం తో అంశాల వారీగా సత్సంబంధాలు కొనసాగుతాయి.రాష్ట్ర సమస్యల విషయం లో రాజీ పడం.
…కెసిఆర్ హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అనే ఒకటే ప్రకటన trs ఓటమి కి కారణం కాదు. బీజేపీ దేశమంతా గెలిచింది .అక్కడ ఇలాంటి ప్రకటనలు లేవే.
హరీష్ రావు ను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టామనేది నిజం కాదు.మెదక్ లో trs మంచి మెజారిటీ తో గెలిచినా సిద్దిపేట లో కూడా పార్టీ మెజారిటీ తగ్గింది.
…సీఎం కెసిఆర్ అంతటా ప్రచారం చేశారు ..ఇంకెవరు ప్రచారం చేశారు చేయలేదనేది ప్రధానం కాదు. ఓటమి ఓ అనాథ లాంటిది.ఇపుడు ఎవరయినా ఏదయినా మాట్లాడుతారు.
…నిజామాబాద్ లో కవిత ఓటమి కి రైతులు కారణం కాదు.నిజామాబాద్ లో నామినేషన్లు వేసింది రైతులు కాదు. రాజకీయ కార్యకర్తలే. జగిత్యాల నియోజక వర్గం ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో 93 మంది నామినేషన్లు తయారయ్యాయి. కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మక్కయ్యాయి కాబట్టే నిజామాబాద్ లో కవిత ఓడింది. నేను కానీ కవిత కానీ అనేక దక్కా మొక్కీ లు తిన్నాం.ఒక్క ఓటమి తో మేము కుంగిపోము.
…రాహుల్ గాంధీ ఓడిపోయారు .కాంగ్రెస్ కార్యకర్తలు దుప్పట్లు కప్పుకుని ఇంట్లో పడుకుంటారా?
…ఏపీ లో జగన్ గెలిచారు. తెలంగాణ ,ఏపీ ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికలు కలిపి వస్తే trs కు నష్టం కలిగేది అనే వాదన తో ఏకీభవించను.
…ఒడిషా లో రెండు ఎన్నికలు కలిపి వచ్చినా నవీన్ అక్కడ గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా సాంకేతికంగా trs లో చేరలేదు. trs కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు తో పార్టీ కి నష్టం జరిగింది అనే వాదన కరెక్టు కాదు.
…మోడీ తో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయి
…హాజీ పూర్ ఘటన పై కొందరు శవాల పై పేలాలు ఏరుకుంటున్నారు. అలాంటి రాజకీయం మేము చేయం .బాధితులకు న్యాయం చేస్తాం.
…ఇంటర్మీడియట్ ఫలితాల పై వివాదాన్ని కొందరు గోరంతలు చేశారు
…కొందరు విద్యార్థుల మరణం బాధాకరం. గ్లోబరీనాకు నాకు సంబంధం ఉందని పనికి మాలిన వాళ్ళు విమర్శలు చేశారు. మంత్రి వర్గ విస్తరణ పై నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం గారే. నేను కాదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *