చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (వీడియో)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. పార్టీ జెండాని ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కొడాలి నాని. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన నాని, టీడీపీకి సవాల్ కూడా విసిరారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

వైఎస్సార్ అడుగుజాడల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నడవడం గర్వంగా ఉందన్నారు నాని. వయసులో మాకంటే చిన్నవాడు జగన్, కానీ ఆయన ఆశయాలు ఎంతో ఉన్నతమైనవి అని వైసీపీ అధినేతను కొనియాడారు. అధికార పార్టీల తప్పుడు హామీలు ఇచ్చి ఓటు వేసే ప్రజల్ని మోసం చేయకుండా, చేయగలిగే హామీలను స్పష్టంగా చెబుతున్న జగన్ కి ఒక్కసారి అవకాశమిచ్చి ఎన్నికల్లో గెలిపించమని ఓటర్లను కోరారు.

గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను…గుడివాడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేది నేనే. గుడివాడలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ ఎవర్ని నిలబెట్టినా ఇక్కడ ఎగిరేది మాత్రం వైసీపీ జెండానే. గుడివాడలో నా మీద పోటీ చేయడానికి టీడీపీ నుండి సరైన అభ్యర్థి లేక పక్కనుండి తీసుకొచ్చి పెడుతున్నారు. చంద్రబాబు ఎవర్ని నిలబెట్టినా ఢీ, జగన్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. ఇక్కడ ఎగిరేది వైసీపీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని. ఇంకా ఆయన ఏం మాట్లాడారో పూర్తిగా తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *