ప్రతి ప్రోగ్రాంకు మోదీని పిలవాల్సిన అవసరం లేదు: కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీతో అంటి అంటనట్లు ఉంటున్నారు. సాధారణంగా ప్రధానిగా ఎన్నికయ్యాక ముఖ్యమంత్రులు మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా కలివస్తారు. కెసిఆర్ పని చేయలేదు. అంతేకాదు, అంతకుముందు ఆయన ప్రధాని పదవీస్వీకార ప్రమాణ కార్యక్రమానికి కూడా ‘వెళ్లలేక’ పోయారు. తర్వాత ప్రధాని అధ్యక్షతన మొట్ట మొదటి సారి జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి వెళ్లేలేదు, కనీసం అధికారులను కూడా పంపలేదు.  ప్రధాని ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి కూడా ఆయన వెళ్లడం లేదు, కాకంంటే కెటిఆర్ పంపిస్తున్నారు.
ఇపుడు కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దానికి మహారాష్ట్రముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వనించారు. ప్రధానికి ఆహ్వానం పంపలేదు. దీన్నంతా చూస్తే ప్రధాని మీద కోపం గా ఉన్నట్లు అర్థమవుతుంది. కారణం , ఆయన స్పష్టం చేశారు. నిన్న రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎందుకు తాను ప్రధానితో , కేంద్రంతో దూరంగా ఉన్నట్లు వివరంగా చెప్పారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఒక సంచలన ప్రకటన చేశారు . కేంద్రంతో తెలంగాణ కేవలం రాజ్యాంగ సంబంధాలను మాత్రమే కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.
రాసుకుపూసుకుతిరగడం జరగదని అర్థం. మోదీ ఫాసిస్టు అని తానే 2014 చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చే ఒక విధంగా,మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేద్దామనుకుంటున్నట్లు కెసిఆర్ మోదీ మీద పరోక్ష యుద్ధం ప్రకటించారు.
ఆయన ఇంకా ఏమన్నాడో చూడండి:
నాలుగేండ్ల కిందట మిషన్ భగీరధ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారు. ప్రతిసారి పిల్చాల్సిన అవసరం లేదు. నేనే కాాళేశ్వరం కార్యసాధకుడిని అని కెసిఆర్ చెప్పారు.
హైదరాబాద్ ను తీవ్రవాదుల అడ్డా అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. అదొక పెద్ద జోక్ అన్నారు. ‘గత అయిదేండ్లలో హైదరాబాద్ మత ఘర్షణలే లేవు. ఉండిందంగా ఉమ్మడి ఆంధ్రలోనే. బాధ్యతాయుతమయిన పదవుల్లో ఉన్నపుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలా.
కేంద్రంలో ప్రజలు మోదీకి అవకాశమిచ్చారు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు..ఇక్కడ మాకు అవకాశమిచ్చారు. మేం చేయాల్సింది మేం చేస్తాం. దీనిపై పెద్ద కల్పనలెందుకు? 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత అతికఠినంగా నిందించిన వ్యక్తిని నేను. మీరు మర్చిపోతే.. నేను మర్చిపోతానా? ఏడు మండలాలు గుంజుకున్నపుడు ఆయన ఫాసిస్టు ప్రధానమంత్రి అన్నాను. ఇది రికార్డుల్లో ఉన్నది.
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయేని సమర్థించాం. అంశాల వారీగా ఇష్టమైన చోట, నచ్చినచోట మద్దతిచ్చాం. నచ్చనిచోట వ్యతిరేకించాం. ఇప్పుడు సైతం అదే సంబంధాలు కొనసాగుతాయి.
కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాష్ట్రానికి అదనంగా రాలేదు. ఇదే విషయంలో అమిత్‌షా తప్పుడు లెక్కలు చెప్పినపుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాను. ప్రతి రూపాయి రికార్డుల్లో ఉంటుంది. ప్రతి రూపాయిలెక్క కేంద్రం దగ్గర ఉంటుంది. రాష్ట్రం దగ్గర ఉంటుంది. కాగ్ ద్వారా ఆడిట్ ఉంటుంది.
నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు కలిపి 24,000 కోట్లు అడిగాం. ఎంత ఇచ్చారు?   24 రూపాయలు సైతం ఇవ్వలేదు.
విభజనచట్టం ప్రకారం బీఆర్జీఎఫ్ రూ.450 కోట్లు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. నాలుగేండ్లు ఇచ్చి ఒక ఏడాది ఇవ్వలేదు. ఇదీ రికార్డుల్లో ఉంది.
రుణమాఫీ సహావంటి వాటిని మాకు మేం చేసుకోగలం. మాకు వర్రీ లేదు. రాజ్యాంగబద్ధంగా మా డిమాండ్లు ముందుంచుతాం. ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ఇవ్వకపోతే ముందుకు సాగుతాం. నీటి వివాదాల విషయంలో రెండు పార్టీలు వైఫల్యం చెందాయనే విషయాన్ని నేను ప్రస్తావించాను.
2004లో ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికీ 15 సంవత్సరాలు గడిచాయి.. హరి లేదు..శివ లేదు. ట్రిబ్యునల్ తీర్పుకే 15 ఏండ్లు…రెండు దశాబ్దాలు అయితే…తీర్పు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి?
ఏపీ సీఎం జగన్  కు అదే చెప్పాను. ‘ఢిల్లీ వద్దు.. ఎవరినీ అడిగే అవసరం వద్దు. ట్రిబ్యునళ్లు లేవు.. కోర్టులు లేవు. మనిద్దరం ఒక మాట అనుకుంటే పరిష్కారమవుతుంది. ప్రాజెక్టులు మొదలుపెట్టుకోవచ్చు,’ అని చెప్పాను. దాన్ని వారు సంతోషంగా స్వాగతించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరొక  అడుగు ముందుకు వేసి ఓ మాట అన్నారు: ‘గుజరాత్ ముఖ్యమంత్రి మా పార్టీకి చెందినవారే. రాస్ట్రా మధ్య ఉన్న వివిధ తగాదాలను ఆయన తెంపుతలేడు. దీంతోటి నేను తెలంగాణకుపోయి నేర్చుకో అని చెప్పాను. తెలంగాణ సీఎం వేరే పార్టీ అతను అయినప్పటికీ సామరస్యపూర్వకంగా చేసుకున్నాను అని,’ అని  ముఖ్యమంత్రి చెప్పారు.