కెసిఆర్ ఫ్రంటుకు ఎపుడూ చిక్కులే… స్టాలిన్ తో మీటింగ్ డౌటే…

కేంద్రంలో  ఫెడరల్ ఫ్రంట్ అంటూ మళ్లీ రాజకీయ  యాత్రలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తో  సమావేశం అయ్యేందుకు డిఎంకె అధినేత స్టాలిన్ సుముఖంగా లేరు.  కాంగ్రెసేతర, బిజెపియేతర ముఖ్యమంత్రులతో పార్టీలతో ఆయన జరిపే చర్చలు ఎపుడూ రెండడుగల మించి ముందుకు సాగడం లేదు.  అన్ని ఒక సమావేశంతో ముగుస్తున్నాయి. గత ఏడాది కూడా ఆయన బిజెపియేతర, కాంగ్రెసేతర ఫ్రంటు అంటూ యాత్రలు చేశారు. ఆయన ఫ్రంటుకు ఒక రూపం ఇచ్చేందుకు ఆ యాత్రలు పనికి రాలేదు. ఇపుడు ఎన్నికలు ముగిసే సమయంలో రెండో రౌండ్ యాత్ర చేస్తున్నారు. సోమవారం రోజు ఆయన కేరళ వెళ్లారు.
కెసిఆర్, డిఎంకె నేత స్టాలిన్  మధ్య జరగాల్సిన మే 13 సమావేశం జరగకపోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
సోమవారం కెసియార్ కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశారు. ఆయనతో మంతనాలాడారు. ఇది ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటు ప్రతిపాదన గురించే నని చెబుతున్నారు.
తదుపరి సమావేశం మే 13న స్టాలిన్ తో జరగాల్సి ఉంది. అయితే, దీనికి సుముఖంగా లేని స్టాలిన్ తాను బిజీ గా ఉన్నట్లు కలవడం సాధ్యం కాదని కెసియార్ కు సమాచారం పంపినట్లు చెబుతున్నారు.
స్టాలిన్ తమిళనాడు లో జరగాల్సిన మే 19 ఎన్నికల ప్రచారం లో బిజిగా ఉన్నారు. గతంలో కెసియార్ స్టాలిన్ ను కలిసేటప్పటికి డిఎంకె-కాంగ్రెస్- వామపక్ష పార్టీల మధ్య పొత్తు లేదు. తర్వాత పొత్తుకుదురింది. ఒకదఫా పోలింగ్ ఏప్రిల్ 18న జరిగింది. ఇలాంటపుడు కాంగ్రెసేతర ఫ్రంటు పేరుతో సమావేశం సాధ్యం కాకవపోవచ్చు. ఇదే సమస్య కర్నాటకతో కూడా వస్తున్నది.
కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తో కూడా కెసిఆర్ సమావేశం జరగకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నానని అలాంటపుడు కాంగ్రెసేతర ఫెడరల్ ఏర్పాటు గురించి మాట్లాడలేనని కుమార స్వామి ఫోన్ లో  కెసియార్ కు చెపినట్లు తెలిసింది.
గత ఏడాది కూడా కెసియార్ తన ఫెడరల్ ఫ్రంటు పనిమీద యాత్రలు జరిపారు. అపుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఒదిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. వీళ్ల వెరూ ఈఫ్రంటును ముందుకు తీసుకుపోయందుకు చొరవ తీసుకునేలా కనిపించలేదు. అందువల్ల అపుడు  కెసియార్ యాత్రలు అంతకంటే ముందుకు సాగలేదు.
దీనికితోడు కెసియార్ కు బిజెపి బిటీమ్ అని ముద్ర పడింది. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలయిన తృణమూల్, బిజెడి లకు ఈప్రతిపాదన అంత రుచించడం లేదు.
(Photo India Today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *