కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ కు గవర్నర్ షాక్ ఇస్తారా???

సాయంకాలం 6.40 నాటి తాజా సమాచారం అధారంగా…

రేస్ లోకి వచ్చిన బిజెపి, ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి ఆహ్వానం?

క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నది కన్నడ రాజకీయం. తాజాగా మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బిజెపిని అధికారానికి దూరం చేయాలనుకుని ముందస్తు ప్రిపరేషన్ మొదలు పెట్టిన కాంగ్రెస్, జెడిఎస్ కు గట్టి షాక్ తగిలింది. గవర్నర్  వజూభాయ్ వాలా తో బిజెపి నేత యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్ లు భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. అతి పెద్ద పార్టీగా ఏర్పడిన బిజెపికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు గవర్నర్ వజూభాయ్ వాలా ప్రకటించేశారని ప్రచారం మొదలైంది.అయితే, రాజ్ భవన్ నుంచి ఎలాంటి అఫిషియల్ కమ్యూనికే రాలేదు.

గోవాలో చేసిన ప్రయోగానికి విరుద్ధంగా ఇక్కడి గవర్నర్ వ్యవహరించారన్న చర్చ సాగుతోంది. గోవాలో మొన్నటికి మొన్న అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ను కాదని బిజెపికి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 17 మందితో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. కానీ కూటమి పేరుతో 13 సీట్లు దక్కించుకున్న బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడి గవర్నర్ ఆహ్వానించారు. అంతిమంగా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కించుకున్నా గవర్నర్ ఆశిస్సులు దక్కక ప్రభుత్వ ఏర్పాటు చేయలేక చతికిలపడింది.

కానీ ఇక్కడ సోనియాగాంధీ అలర్ట్ అయ్యారు. కర్ణాటక ఫలితాలు వస్తున్న సందర్భంలో వేగంగా పావులు కదిపారు. వెంటనే దేవెగౌడతో ఫోన్ లో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిని జెడిఎస్ కు ఆఫర్ చేశారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిస్తే గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకలేదు. జెడిఎస్ నేత కుమారస్వామి కి గవర్నర్ అపాయింట్ మెంట్ దొరికింది. కానీ అప్పటికే బిజెపి నేతలు యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరారు. వారు బయటికొచ్చినప్పటి నుంచి బిజెపి వారికి వారం గడువు ఇచ్చారని చెబుతున్నారు.

ఇక జెడిఎస్ లో రేవణ్ణ వర్గాన్ని బిజెపి లాగే ప్రయత్నం చేస్తోంది. రేవణ్ణ వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. వారంతా మద్దతిస్తే బిజెపికి సరిపోతుంది. వారిలో రేవణ్ణ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని, మిగతా వారికి మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ పెడుతోంది బిజెపి.

అయితే గోవాలో గవర్నర్ పెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ కు షాక్ ఇస్తే ఇక్కడ పెద్ద కూటమిగా నిలిచిన కాంగ్రెస్, జెడిఎస్ కు షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఇక్కడా, అక్కడా మేలు జరిగిందన్న చర్చ ఉంది.  ఇక బిజెపి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటే ఆ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. లేదంటే వారం రోజుల్లోగా బల నిరూపణ చేయలేకపోతే మళ్లీ కాంగ్రెస్, జెడిఎస్ కూటమిని గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ ఈలోగా బిజెపి చతురత ప్రదర్శించి తన నైపుణ్యంతో జెడిఎస్ లో చీలిక తెచ్చి మద్దతు కూడగట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

మొత్తానికి గవర్నర్  కాంగ్రెస్, జెడిఎస్ కూటమికి  షాక్ ఇస్తారని కన్నడ రాకీయాల్లో టాక్ నడుస్తోంది.

గవర్నర్ నిర్ణయం వెలువడలేదా ?
ప్రస్తుతం గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, పూర్తి వివరాలు అందిన తర్వాతే ఏ పార్టీని పిలుస్తారు? లేదంటే కూటమిని పిలుస్తారో తేలుతుందని చెబుతున్నారు.

One thought on “కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ కు గవర్నర్ షాక్ ఇస్తారా???

  1. MODI mark kullu rajakeeyalu Ive…Governer vyavastani vallaki elaaa kavali ante alaaa vaadukuni…prajala SWAMYANNI khooni chestunna MODI and AMITH SHAH…eee Dani grahalu INDIA ni patti peedistunnai…eppudu Graham veedu tundho…MODI,CBN Lu DEMOCRACY ni khooni chestunnaru Valla adhikram kosham…ilaage Governer Lani manage chesi 5 states lo CONG ki adhikaraniki daggara daakaaa vachina chance ni laagesukunna MODI,SHAH..veellaki prajaa seva cheyyatam kaadhu mukyam…Hitler laaa INDIA ni dictator laaa rule cheyyamani choostunnadhi…idhi INDIA lanti democratic country ki manchi kaadhu ani naaa opinion….prajalu ichina teerpuni gouravinchatam…Balanagar,balagam to adhikaranni Vasanth chesuko koodadhu…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *