జగన్ కు కర్నాటక కౌంటర్, కర్నాటక జాబ్స్ కన్నడిగులకే : నటుడు ఉపేంద్ర

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే కంపెనీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రలో హర్షం వ్యక్తంకావచ్చేమో గాని, పక్క రాష్ట్రాలలో  వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది.
ఆంధ్రకు చుట్టూర ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ వాద సెంటిమెంట్ బాగా ఎక్కువ. కర్నాటకలో తమిళనాడు, మహారాష్ట్రలు ప్రాంతీయోద్యమాలకు మారుపేరు. అక్కడి ప్రజల్లో భాష రాష్ట్ర వాదం బాగా ఎక్కువ. అదే విధంగాఇపుడు తెలంగాణలో కూడా.
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే అన్ని రకాల పరిశ్రమలలో పిపిపి వెంచ్చర్సలను కలిపి  75 శాతం ఉద్యోగాలు ఆ జిల్లాల వారికి రిజర్వు చేయాలని జూలై 23 అసెంబ్లీ బిల్ పాస్ చేసింది.
ఈ బిల్లు ప్రకారం కంపెనీలు మొదట జిల్లాలలో తమకు అవసరమయిన టాలెంట్ హంట్ జరిపి తీరాలి.
పరిశ్రమలకు స్థానిక రైతుల నుంచే భూములు సేకరించాలి. తమ భూములను పరిశ్రమలకిచ్చి ఉద్యోగాల  కోసం రైతులు తమ బిడ్దలను ఇతర ప్రాంతాలకు వలస పంపడంలో న్యాయం లేదనేది ముఖ్యమంత్రి వాదన.
ఇపుడు ఉద్యోగాల కోసం రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసుకుని యువకులు వలస పోతున్నారు. బెంగుళూరు, చెన్నైలలో తెలుగు వారు పెద్ద ఎత్తున ఉన్నారు.
అదే విధంగా ఇక్కడి ఐటి కంపెనీలలోకి నార్త్ నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున యువకులు ఉమ్మడి ఆంధ్ర రాజధాని హైదరాబాద్ వచ్చారు. ఆంధ్రలో ఇంకా పరిస్థితి రాలేదు. ఇది వేరే విషయం.
ఇలాంటి లిబరల్  వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయడానికి వ్యతిరేకత మొదలయింది. ఇదిఅమలుచేయడం సాధ్యంకాకపోవచ్చు. కాని, దీని మీద వ్యతిరేకమొదలయింది.
దీనికి బహిరంగంగా మొదటిసారి వ్యతిరేకత కర్నాటక నుంచి వస్తున్నది.

కర్నాటక నటుడు, ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ(UPP) నేత ఉపేంద్ర ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని తప్పు బట్టారు. ఉపేంద్ర తీసిన సినిమాలు ఆంధ్రలో కూడా బాగా ఆడాయి.వసూళ్లు చేశాయి.  ఆయన ఆంధ్రలో కూడా పేరున్నవాడే. అయినా సరే , జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు వెనకాడడం లేదు.
జగన్  75 శాతం స్థానిక రిజర్వేషన్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ‘కర్నాటక ఉద్యోగాలు కన్నడిగులకే’ (Karnataka Jobs for Kannadigas) అనేె ఎదురు ఉద్యమం చేపడుతున్నారు.
తన ఉద్యమాన్ని ఆయన ఆగస్టు 14, 15 తేదీలలో ఒక నిరసన కార్యక్రమంతో ప్రారంభిస్తున్నారు.కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకూడా ఆయనకు మద్దతు తెలిపారు.
కర్నాకటలో ఉద్యమం అంటుకుంటే తెలుగు యువకులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అక్కడినుంచి ఈ ఉద్య మం తమిళనాడు, మహారాష్ట్రలకు పాకేదన్న గ్యారంటీ లేదు.
ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లే కాకుండా బెంగుళూరు, మైసూరు, బళ్లారి, రాయచూరు ప్రాంతాలలో చాలా కాలం కిందట స్థిరపడిన  తెలుగు వాళ్లూ ఉన్నారు.
ర్నాటక ఉద్యోగాలు కన్నడిగులకే అంటే అక్కడ ఉన్న తెలుగువాళ్లకు ఉద్యోగాలు రావడం కష్టం గా ఉంటుంది.
ఐటి కంపెనీలు కొత్త వాళ్లను తీసుకునేటపుడు ఆంధ్రావాళ్లను ఏరిపారేసే ప్రమాదం ఉంది.
ఉద్యోగాలు సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి, ఇపుడు చెలరేగుతున్న ప్రాంతీయవాదాల నేపథ్యంలో ప్రాంతీయ ఉద్యమాలను రేచ్చగొట్టడం చాలా సులభం. ఉపేంద్ర ఉద్యమం ఏ స్వరూపం తీసుకుంటుందోచూడాలి.
అనేక బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన ఉపేంద్ర కూడా 2018లో ఉత్తమ ప్రజాకీయ పార్టీ పెట్టారు (UPP). అదింకా తన ప్రభావాన్ని చూపలేకపోయింది.
ఇపుడు యుపిపి కి మంచి నినాదం దొరికింది. రాష్ట్ర వ్యాపితంగా ఫ్యాన్స్ తో కర్నాటకఉద్యోగాలు కన్నడిగులకే అని పిలుపిస్తే తప్పకుండా ఉద్యమం వూపందుకోవచ్చు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/tungabhadra-in-spate-flood-alert-issued-for-kurnool-andhra-pradesh/