Home News క‌న్నా వ‌ర్సెస్ రాయ‌పాటిః చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల చిర‌స్మ‌ర‌ణీయ పోటీ

క‌న్నా వ‌ర్సెస్ రాయ‌పాటిః చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల చిర‌స్మ‌ర‌ణీయ పోటీ

78
0
SHARE

అమ‌రావ‌తిః రాష్ట్రంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరు తుది అంకానికి చేరుకుంది. కాస్త ఆల‌స్యంగానైనా కీల‌క స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది భార‌తీయ జ‌న‌తాపార్టీ. గురువారం సాయంత్రం ఢిల్లీలో దీనికి సంబంధించిన జాబితాను పార్టీ నాయ‌కులు విడుద‌ల చేశారు. కొన్ని అనూహ్య అభ్య‌ర్థిత్వ పేర్లు జాబితాలో క‌నిపించాయి. అందులో మొట్ట‌మొద‌టిది గుంటూరు జిల్లాలోని న‌ర‌స‌రావు పేట లోక్‌సభ స్థానం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌తుర్ముఖ పోటీ ఖాయ‌మైంది.

కార‌ణం- గుంటూరు జిల్లా మొత్తాన్నీ త‌న కంచుకోట‌గా మార్చుకున్న బ‌ల‌మైన నాయ‌కుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేస్తుండ‌ట‌మే. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి పెద్ద‌గా ప‌రిచ‌య వాక్యాలు అక్క‌ర్లేదు. మూడు ద‌శాబ్దాలుగా ఆయ‌న గుంటూరు జిల్లా రాజకీయాల‌ను శాసిస్తున్నారు. కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కునిగా గుర్తింపు పొంది. జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్ర‌శాఖ అధ్య‌క్షుడు కూడా. న‌ర‌సరావు పేట లోక్ స‌భ బ‌రిలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ దిగ‌డం స‌మీక‌ర‌ణాల‌ను పూర్తిగా మార్చివేసిందన‌డంలో సందేహాలు అన‌వ‌స‌రం.

తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఆయ‌న‌కు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి. గతంలో ఎప్పుడూ వారిద్ద‌రు ముఖాముఖి తార‌స‌ప‌డ‌లేదు. ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘ‌కాలం పాటు కొన‌సాగిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రి మ‌ధ్య స‌త్సంబంధాలు లేవు. గుంటూరు లోక్ స‌భ‌కు రాయ‌పాటి పోటీ చేయ‌గా.. అసెంబ్లీ బ‌రిలో క‌న్నా పోటీ చేస్తూ వ‌చ్చారు ఇన్నాళ్లు. తొలిసారిగా వారిద్ద‌రూ వేర్వేరు పార్టీల నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తుండ‌టం అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, వైఎస్ఆర్ సీపీ త‌ర‌ఫున లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు బ‌రిలో ఉన్నారు. బీజేపీ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించేంత వ‌ర‌కూ పోటీ ఈ ఇద్ద‌రి మ‌ధ్యే ఉంటుంద‌ని భావించారు. తాజాగా క‌న్నా రేసులోకి దూసుకొచ్చేయ‌డంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి కూడా పోటీలో ఉండ‌టం ఖాయం. దీనితో న‌ర‌స‌రావు పేట లోక్ స‌భ సెగ్మెంట్ లో చ‌తుర్ముఖ పోటీ ఏర్ప‌డింది.

ఇక విశాఖ‌ప‌ట్నం నుంచి పురంధేశ్వ‌రి అభ్య‌ర్థిత్వం ఖాయ‌మైంది. ఇది ఊహించిన‌దే. విజయనగరం- సన్యాసిరాజు, నర్సాపురం-మాణిక్యాలరావు
గుంటూరు -జయప్రకాశ్, అనంతపురం – చిరంజీవిరెడ్డి, ఏలూరు- చిన్నం రామకోటయ్య, హిందూపురం -పార్థసారథి, నెల్లూరు- సురేశ్ రెడ్డి లోక్‌స‌భ బ‌రిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here