ప్రభుత్వ సలహాదారుగా ‘ట్రెండింగ్ తెలుగు’ రచయిత అశోక్

‘ట్రెండింగ్ తెలుగు న్యూస్‘ (TTN) ఇంగ్లీష్ కాలమిస్ట్ టంకశాల అశోక్ ను అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
ఆయన సీనియర్ జర్నలిస్ట్, రచయిత, సాహిత్యకారుడు. ఆంధ్రప్రభ, ఉదయం వంటి  పత్రికలకు ఆయన మొదట ఢిల్లీ ప్రతినిధిగా చాలా కాలం పనిచేశారు. అంతకు ముందు ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూవిశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలలో ఎమ్మెే చేశారు. ఎంఫిల్ కూడా చేశారు.
తర్వాత ఆయన జర్నలిజం లోకి వచ్చారు. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రభకు అసోసియేట్ ఎడిటర్ గా వచ్చారు.తర్వాత వార్తలోచేరి సంపాదకుడయ్యారు కొద్ది రోజులు హన్స్ ఇండియా కూడా సంపాదకుడిగా ఉన్నారు.
లోతైన రాజకీయ విశ్లేషణలకు అశోక్ పెట్టింది పేరు.
సలహాదారుగా నియయిస్తూ ఈ రోజే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టంకశాల అశోక్ తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలసి  కృతజ్ఞతలు తెలిపారు.
రేపు ఆయన  బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎల్లుండి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వస్తున్న ప్రతినిధి బృందంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారంకోసంచర్చల్లో పాల్గొంటారు.