తెలంగాణ కాంగ్రెస్ పెద్దాయనకు కోపం మొచ్చింది

కాంగ్రెస్ పెద్దాయన జానారెడ్డికి కోపమొచ్చింది. తెలంగాణా రాజకీయాల్లో జానా అరుదైన వ్యక్తి. ఎవరిమీద పెద్ద ఆగ్రహించడు. ఎవరినీ పరుషంగా మాట్లాడడు. ఒక్క బూతు మాట ఆయన నోట రాదు. అలాంటి పెద్ద మనిషిని కెసిఆర్ గిల్లాడు. శుక్రవారంనాడు హుస్నాబాద్ సభలో మాట్లాడుతూఇక జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోవచ్చని అన్నారు. ఎందుకంటే, కెసిఆర్ ప్రభుత్వం  రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తాను గులాబీ జెండా పట్టుకుంటానని జానారెడ్డి అన్నారని, ఇపుడు తెలంగాణాలో 24 గంటల కరెంటు సరఫరా వుందని అంటూ, ఇక జానారెడ్డి గులాబీ జండా పట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు.

ఇది కాంగ్రెస్‌ సినీయర్‌ నేత జానారెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ‘తెలంగాణ రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని నేనెపుడూ చెప్పలేదు.  కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు,’ అని  జానారెడ్డి అన్నారు.

తాను అలాంటి ప్రకటన చేసినట్లు ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.

‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు అబద్దాలు ఎలా చెబుతారు. ఇష్టానుసారంగా  మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసియార్  ఆత్మ విమర్శ చేసుకోవాలి. నాకు  క్షమాపణలు చెప్పాలి,’ అని డిమాండ్‌ చేశారు.

నిన్నటి హుస్సాబాద్ సభలో ప్రసంగిస్తూ  జానారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి  కేసీఆర్ చాలా సార్లు ఎత్తిపొడుపు ప్రస్తావనలు చేశారు.  ‘తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ హామీ నిజంచేస్తే  గులాబీ కండువా  కప్పుకుని, టీఆర్ఎస్త పార్టీ తరఫున  ప్రచారం చేస్తానని  కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి గారు అన్నారు. మరి  జానారెడ్డికి 24 గంటల కరెంట్ కనిపించడం లేదా అని కెసిఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *