మహా న్యాయవాది రామ్ జేత్మలానీ మృతి, ఆయన ఎంత వివాదాస్పదుడో…

తనెటు వైపో చివరి దాకా ఎవరికీ చెప్పని, ఆయనెటువైపో ఎవరికీ ఇప్పటికి అర్థంకాని న్యాయవాద శిఖరం ఒరిగింది.
దేశంలో మేటి క్రిమినల్ లాయర్, ఆర్ జెడి ఎంపి రామ్ జేత్మలానీ ఈ  ఉదయం మరణించారు.
 ఆయన వయసు 95 సంవత్సరాలు. రెండువారాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న జేత్మలాని ఈరోజు ఉదయం 7.45 కు న్యూఢిల్లీ  అధికార నివాసంలో కన్నుమూశారు.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలోని శిఖాపూర్ లో 1923, సెప్టెంబర్ 14న ఆయన జన్మించారు. వారు తర్వాత భారతదేశానికి వచ్చారు. రామ్‌జెఠ్మలానీ పూర్తిపేరు రామ్‌భూల్‌చంద్ జెఠ్మలానీ. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు మహేష్ జేత్మలానీ కూడా బాగా పేరున్న న్యాయవాది. కూతురు అమెరికా లోఉన్నారు.
ఆరవ, ఏడవ లోక్ సభలకు ఆయన బిజెపి అభ్యర్థిగా గెలుపొందారు.వాజ్ పేయి నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి,న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అపుడే అర్బన్ డెవెలప్ మెంటు మంత్రిగా ఉన్నపుడు  తెలంగాణ బిజెపి నేత బండారు దత్తాత్రేయ ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
అంతకు ముందు 1971లో మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ నుంచి బిజెపి, శివసేన సాయంతో లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు.
ఆయనకు పగ్గాల్లేని న్యాయవాది ఏకేసునైనా సరే ఇష్టపడితే వాదిస్తారు. దేశంలో సంచలనం సృష్టించిన కేసులలో ముద్దాయిల తరఫున వాదించడం ఆయన కు అలవాటు. కాంగ్రెస్ వ్యతిరేక కేసులో వాదించాడని ఆయనను బిజెపి అనుకోలేం. ఆయన బిజెపిని కూాాడా కోర్టు కీడ్చిన సందర్భాలున్నాయి.
గొప్పకేసులనే కాదు, చాలా వివాదాస్పదమయిన కేసులను కూడా వాదించారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య కేసులలో ముద్దాయిల తరఫున వాదించి సంచలనం సృష్టించారు. అదే విధంగా హవాలా కేసులో అద్వానీ తరఫున, జయలలిత తరఫున, పశువుల దాణ కేసులో లాలూ తరఫున వాదించారు. పార్లమెంటు మీద దాడి జరిగిన కేసులో అఫ్జల్ గురు తరఫున కూడా ఆయన వాదించారు. ఆయన లాలూప్రసాద్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిగా ఆయన 2016 రాజ్యసభ కు ఎన్నికయ్యారు.
బ్రిటిష్ ఇండియాలో  ఆయన 18 యేళ్లకే బాంబే విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్ర పట్టా పొందారు. అయితే, ఆయన మొదట న్యాయవాది ప్రాక్టీస్ ప్రారంభించింది కరాచీ నుంచి. ఇది బ్రిటిష్ ఇండియా రోజుల నాటి మాట. కరాచీలో ఎకె బ్రోహి అనే మిత్రుడితో కలసి ఆయన సొంత లా సంస్థ ను ప్రారంభించారు. దేశ విభజన సమయంలో ఆయన ఇండియాకు వలస వచ్చారు.
1959లో నానావతి హత్య  ఆయన గొప్ప న్యాయవాదిగా వెలుగులోకి వచ్చారు.
నానావతి కేసు ఏమిటంటే…
కవాస్ మానెక్ షా నానావతి అనే వ్యక్తి నే వీ కమాండర్ . ఆయన భార్య బ్రిటిష్ కు చెందిన సిల్వియా. ఆమె ప్రియుడు ప్రేమ్ అహుజా.అహూబా నానావతి కాల్చి చంపాడు. వాళ్ల బెడ్ రూంలోకి ప్రవేశించి, అహూజాు కాల్చి చంపి,బాంబే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కేసు నానావతి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం గా 1959లో విచారణకు వచ్చింది. అహూజా సోదరి ఏర్పాటు చేసిన న్యాయవాదుల బృందంలో రామ్ జేత్మలాని సభ్యుడు. ఈ కేసులో రామ్ జేత్మలాని వాదించకపోయినా, నానావతి నిర్దోషి అని ట్రయల్ జ్యూరీ లో రుజువయిపోవడంతో ఈ బృందానికి బాగా పేరొచ్చింది. పాకిస్తాన్ వలస వచ్చి ఇండియాలో న్యాయవాదిగా స్థిరపడాలనుకుంటున్న జేత్మలానీకి ఈ కేసు బాగా సహకరించింది. టాలెంట్ ఉన్న లాయర్ గా ఆయన కుబాగా పేరొచ్చింది. అయితే, ఈకేసుతర్వాత హైకోర్టు కెళ్లింది. హైకోర్టులో హత్య రుజువయింది. నానావతికి జీవిత ఖైదు పడింది. అయితే, నానావతి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా శిక్ష పడిన కొద్ది గంటలలోనే అప్పటి బొంబాయి గవర్నర్ విజయలక్ష్మీ పండిట్ ఆయన కు క్షమా బిక్ష పెట్టారు. తర్వాత నానావతి, భార్య సిల్వియా రాజీ పడ్డారు. కెనాడాలో స్థిరపడ్డారని న్యూస్ 18 రాసింది.
ఇదే ఆయనను గొప్ప క్రిమినల్ కేసుల న్యాయవాదిగా మార్చింది.2010లో ఆయన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యకుడిగా ఎన్నికయ్యారు.
2017 సెప్టెంబర్ 10 న న్యాయవాద వృత్తినుంచి రిటైర్ అవుతున్న ట్లు ప్రకటించారు.
1975లో ఇందిరగాంధీ ఎమర్జన్సీ ప్రకటనను ఆయన వ్యతిరేకించారు. అపుడు బార్ అసోసియేష్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందిరగాంధీని వ్యతిరేకించాక ఆయన దేశం విడిచి కెనడా పారిపోవలసి వచ్చింది.1977 ఎన్నికల్లో ఆయన కెనాడా నుంచే పోటీ చేసి అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్ ఆర్ గోఖలే ను నార్త్ వెస్టు ముంబై నుంచి ఓడించారు. తర్వాత 1980 ఎన్నికల్లో కూడా గెలిచారు.
అయితే, యుపిఎ-2 ప్రభుత్వంలో అవినీతి మీద మౌనంగా ఉన్నందుకు 2012లో భారతీయ జనతా పార్టీ ఆయనను బహిష్కరించింది. బిజెపి ఖాయిలాపడిందని ఆయన వ్యాఖ్యానించారు.దీనితో ఆగ్రహించిన పార్టీ ఆయనను ఆరేళ్ల పాటు బహిష్కరించింది.
ఆయన వాదించిన ప్రముఖ వివాాదాస్పద  కేసులు
1. ఇందిరా గాంధీ హత్యకేసులో ముద్దాయిల తరఫున
2. రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిల తరఫున
3. స్టాక్ స్కామ్ లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ల తరఫున
4. మాఫియా డాన్ హాజీ మస్తాన్ తరఫున
5. పార్లమెంటు దాడిలో మరణ దండన ఎదుర్కొంటున్న అఫ్జల్ గురు తరఫున
6.హవాలా స్కామ్ లో ఎల్ కె అద్వానీ తరఫున
7.జెస్సికా లాల్ మర్డర్ కేసులో మను శర్మా తరఫున
8.షోరాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ హోమ్ మంత్రి అమిషా తరఫున
9.రామవతార్ జగ్డి హత్యకేసులో అజిత్ జోగి కుమారుడు అమిత్ జొగి తరఫున
10.2జి కేసులో డిఎంకె ఎంపి కణిమోళి తరఫున
11. అక్రమ మైనింగ్ కేసులో యడ్యూరప్ప తరఫున