Home News భూమా అఖిల ప్రియకు అస్వస్థత

భూమా అఖిల ప్రియకు అస్వస్థత

102
0
SHARE

ఏపీ మంత్రి, ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమా అఖిల ప్రియ అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. అయినా కూడా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిల ప్రియకు తీవ్ర వడదెబ్బ రావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆమెకు ఇంట్లోనే వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ఆమె మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు.

అఖిల ప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటి చేస్తున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని భూమా కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.