బోర్ వాటర్, ఉప్పునీళ్లకు హైదరాబాద్ స్టార్టప్ పరిష్కారం

హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ తాగేందుకు పనికేరాదు. దీనిని తాగేందుకు వాడవద్దని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్ మెంట్ అధారిటీ హెచ్చరించింది.

ఒక వేళ తాగేందుకు వాడాలంటే మాత్రం ఈనీళ్లలో ఉన్న బయోలాజికల్ కెమికల్ కాలుష్యాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయడమనేది ఖరీదైన వ్యవహారమే కాదు, కష్టమయినది కూడా అని  హెచ్ ఎం డి ఎ పేర్కొంది.

అందువల్ల గ్రౌండ్ వాటర్ ను సాధ్యమయినంత వరకు తాగేందుకు వాడవద్దని, మునిసిపల్ వాటర్ లేకపోతే వాడాలని హెచ్ ఎం డి ఎ చెప్పింది. ఇతర అవసరాలకు వాడుకున్నా పైపులు పాడయిపోతాయి. ట్యాప్ లన్నీ మసకబారుతాయి. వాటి మీద నీళ్లోలోఉండే  రసాయనాల క్రస్టు గా పైపుల లోపలా బయటా పేరుకుపోయి కొంతకాలానికి పనికి రాకుండా పోతాయి. మూసుకుపోతాయి. వాటిని రెగ్యులర్ మార్చాల్సి ఉంటుంది.

ఇలాంటి వాటిని వ్యవహారిక భాషలో ఉప్పనీళ్లని ఒక్కమాటలో చెప్పినా, ఇంగ్లీష్ విస్తృతార్థం లో  హార్డవాటర్ అంటారు.కాల్షియం, మెగ్నీషియమ్, క్లోరైడ్, సల్ఫూట్, నైట్రేట్ వంటి లవణాలు చాలా ఎక్కువగా  ఉండటం  వల్ల ఈ నీళ్లకు హార్డ్ నెస్ వస్తుంది. ఈ నీళ్లతో బట్టలు ఉతకలేం, స్థానం చేయలేం. అన్ని సమస్యలే. విపరీతంగా మంచినీళ్ళ సమస్యఉన్న హైదరాబాద్ లో ఈ కఠిన జలం సమస్యను ఇంకా తీవ్రం చేస్తున్నది.

అయితే, హైదరాబాద్ కు చెందిన  ఒక స్టార్టప్ కంపెనీ చవగ్గా ఈ వాటర్ హార్డ్ నెస్ ను పోగొట్టే విధానం కనుగొంది. ఈ విధానం చాలా చౌకయినది, అందరికీ అందుబాటులో ఉంటుంది.

చిన్న ప్పటి నుంచి ఈ సమస్యను తమ ఇళ్లలో ఎదుర్కొనడం చేసి, రాజేష్ షరాఫ్, ఉదయ్ నడివాడే అనే ఇద్దరు స్నేహితులు దీనికి పరిష్కారం కనుగొనాలనుకున్నారు.

ఈ నీళ్లను శుద్ధిచేసేందుకు రకరకాల పద్ధతులు వాడారు. అయితే అవన్నీ కూడా చాలా ఖరీదయినవి కావడంతో మానేశారు. ఇక లాభం లేదనుకుని హైదరాబాద్ లో ని బోర్ వాటర్ ను మృదువుగా మార్చేందుకు ఒక కొత్త పరిష్కారంకనుగొనాలని నిర్ణయించారు. తక్కువ ధరతో అందరికి అందుబాటులో ఉండే విధంగా,పర్యావరణ అనుకూలంగా కఠినజలం లేదా ఉప్పునీళ్ల సమస్యను పరిష్కరించాలనుకున్నారు. దాదాపు ఒక ఏడాది పాటు శ్రమించారు. ఇలాంటి ఉప్పునీళ్లను శుద్ధిచేసేందుకు మార్కెట్లో చాలా పరికరాలున్నాయి. మరొకటి తయారు చేయడం కాదు, ప్రజలను అన్ని విధాల ఫ్రెండ్లీ గ ఉండే పద్ధతి కనిపెట్టానుకున్నారు. చివరకు విజయవంతమయ్యారు. తాము తయారు చేసిన పరికరానికి బిఫాచ్ (BEFACH) అని పేరు పెట్టారు. మార్కెట్లో ఉండే మిగతా పరికరాల లాగ ఒక సారి ఇన్ స్టాల్ చేశాక,దీనికి మెయింటెన్స్ కూడా ఉండదు. మార్కెట్ లో ఉన్న వాటి ధర రు. 30 వేల దాకా ఉండే బిఫాచ్ ధర కేవలం రు. 3600 మాత్రమే. యేడాదికి మూడులక్షల లీటర్ల దాక బోర్ వాటర్ వాడకం ఉండే ఇళ్లలో వాడేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఇదెలా పనిచేస్తుంది…

రాజేష్ ఉదయ్ తయారు చేసిన పద్దతి నీళ్లను శుద్ధి చేసేవిధానం రెగ్యులర్ విధానకంటే భిన్నంగా ఉంటుంది. నీళ్ల ని శుద్ధి చేసేందుకు వీళ్ల విధానంలో పుడ్ గ్రేడ్ మీడియాని అంటే ఫాస్ఫేట్స్ ను వాడతారు. ఇవి కాల్సియం అయాన్ లకు ఉన్న అతుక్కునే గుణాన్ని పోగొడగాయి. సాధారణంగా ఉప్పునీళ్ల వాడినపుడు కాల్షియం పూతలాగా బకెట్లకు పైపులకు, ట్యాప్ లకు, గోడలకు అంటుకుపోయి అవి చాలా అపరిశుభ్రంగా కనిపించేలాచేస్తాయి. కొంతకాలనికి ఇవి పనికి రాకుండా పోతాయి. దీనికి అతీతంగా ఉండే ఇళ్లు ఎక్కడా ఉండవు.


ఈ కొత్త పరికరాన్ని వాడటం కూడా చాలా సులభం, దీనికి పైపులు, ప్లంబర్ , విద్యుత్త అవసరమే లేదు. మీరు చేయాల్సిందంతా సీసా రూపంలో ఉండే పరికరాన్ని వాటర్ ట్యాంక్ లో వేయడమే.

దీనికి కరెంటు కూడా అవసరం లేదు. సాధారణంగా మనం వినియోగించ నీటిశుద్ధి పద్ధతులలో 20 నుంచి 30 శాతం నీళ్లు వృధాఅవుతాయి. ఈవిధానంలో ఒక్క చుక్కకూడా వృధాకాదు.

ఈ పరికరాన్ని రాజేష్ , ఉదయ్ లు 2018 జూలైలో మార్కెట్లోకి విడుదల చేశారు.

ఇపుడు వారిద్దరు తాగేనీళ్లను శుద్ధి చేసే బాటిల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారు. నాన్ ఫైబర టెక్నాలజీ ఉపయోగించి బాటిల్ లోనే ఫిక్స్ చేసే పరికరాన్ని తయారుచేసేందుకు చూస్తున్నారు. ఈవిధానంలో లీటర్ వాటర్ ఫిల్టర్ చేసేందుకు 20 పైసలకంటే ఎక్కువ కాదు. ఇదే విధంగా హాటళ్లలో విడుదలయ్యే వృధా నీళ్లని శుద్ధి చేసే ఒక పౌడర్ తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇది పౌడర్ వాడితే నీళ్ల వృధాని 80 నుంచి 90శాతం దాకా నివారించవచ్చు.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *