Home Telugu ఇండియా-పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ చరిత్ర ఎలా సృష్టించిందో తెలుసా?

ఇండియా-పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ చరిత్ర ఎలా సృష్టించిందో తెలుసా?

192
0
SHARE
క్రికెట్ మ్యాచెస్ లో అత్యంత ఉత్కంఠతో చూసే మ్యాచ్ ఒక్కటే అది ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్.
ప్రపంచకప్ కోసం ఇండియా పాకిస్తాన్ లు తలపడటం ఇది ఏడోసారి.
మొన్న మాంచెస్టర్ లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని దాదాపు నూరు కోట్ల మంది దాకా చూశారని అంచనా. మధ్యలో వాన వచ్చి మ్యాచ్ కు కొద్ది సేపు అంతరాయం కలిగించినా, మ్యాచ్ చూడాలన్న ఉత్సాహాన్ని నీరు కార్చ లేకపోయింది.
స్టేడియంలో 23,500 సీట్లు వుంటే దరాఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 8,00,000. సీట్లన్ని నిమిషాల్లో అమ్ముడు పోయాయి. కొందరు రీసేల్ చేశారు. ధర ఎంత పలికిందో తెలుసా రు. 60 వేల రుపాయలు.
మ్యాచ్ జరుగుతున్నపుడు క్రికెట్ ను లైవ్ వీక్షించిన వారు సుమారు 50 కోట్ల దాకా ఉన్నారని ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ డేవిడ్ రిచర్డ్ సన్ తెలిపారు. దీనికి డిజిటల్ చానెళ్లు, మ్యాచ్ ను ప్రసారం చేసిన ఇతర ప్లాట్ ఫామ్స్ ను కూడా పరిగణనలోనికి తీసుకుంటే మ్యాచ్ వీక్షించిన వారి సంఖ్యమొత్తంగా 100 కోట్లకు చేరి ఉంటుందని ఆయన అంటున్నారు.
అంతకు ముందు భారీ రికార్డు 2011 లో జరిగిన ఇండియా-శ్రీలంక్ ప్రపంచ కప్ మ్యాచ్.అపుడు 558 మిలియన్ల మంది వీక్షించినట్లు సమాచారం.
ఇపుడు 1000 మిలియన్లు వీక్షించడం ప్రపంచ రికార్డు అంటున్నారు.
1969, జూలై 20న  మొట్టమొదటిసారి చంద్రుని మీద మనిషి కాలుపెట్టడం వీక్షించడాన్ని కూడా మొన్నటి ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ అధిగమించింది. అపుడు అపోలో మూన్ ల్యాండింగ్ మిషన్ లైవ్ వీక్షించిన వారు 530 మిలియన్లు.
మాంచెస్టర్ మ్యాచ్ ను స్టేడియంలో కళ్ళారా చూసేందుకు బిలినీర్లు కూడా స్పెషల్ జెట్ విమానాలేసుకుని వచ్చి బాలివుడ్ స్టార్ల పక్కన కూర్చుని మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.వర్షం వస్తున్నా కొంతమంది పాకిస్తాన్ క్రికెట్ ప్రియులు ఒపెన్ టాప్ బస్సులో వచ్చారు. ఒకరైతే ఏకంగా గుర్రం స్వారీ చేస్తూ స్టేడియం చేరుకున్నారు.
పుల్వామా దాడి తర్వాత రెండు దేశాలు యుద్ధానికి తలపడేంతదాకా వచ్చిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ మ్యాచ్ ను విరగబడి చూసేందుకు యుద్దవాతావరణంసృష్టించిన టెన్షన్ కూడా ఒక కారణమని చెబుతున్నారు.
వైరం , యుద్ద వాతావరణం కారణంగా రెండుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు బాగాసన్నగిల్లాయి. 2007 నుంచి టెస్ మ్యాచ్ జరగనేలేదు.
అందుకే వేలం వెర్రిగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు.
ఇండియా క్రికెట్ ను పిచ్చి పిచ్చిగా అభిమానించే అంకుర్ బెనర్జీ (39) దక్షిణాఫ్రికా జొహానెస్ బర్గ్ నుంచి 16 గంటలు విమానం లో ప్రయాణిం చేసి మాంచెస్టర్ చేరుకున్నారు.
ఇదే విధంగా పాకిస్తాన్ సపోర్టర్ హసన్ ఘని 16,998 కిమి ప్రయాణం చేసి లాస్ ఎంజెలిస్ నుంచి మ్యాచ్ చూడాటానికి మాంచెస్టర్ కు వచ్చారు.
అయితే, ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఎపుడూ ఇండియాను ఓడించలేదు. ఈ సారి 89 పరుగుల తేడాతో ఓడిపోయింది.
క్రికెట్ మ్యాచ్ జరిగిన ఓల్డ్ ట్రాఫొర్డ్ యజమాని అయిన లాంక్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తమ ఆసియా అతిథుల కోసం అద్భుతమయిన ఏర్పాట్లు చేసింది. హాస్పిటాలిటీ బాక్స్ లలో ప్రత్యేక హలాల్, శాకాహార భోజనాలతో స్పెషల్ మెన్యూ తయారయింది.  ఒక్కొక్కరి బోజనం ధర 1800 పౌండ్లు.
(Healthy Reading,Healthy journalism కోసం trendingtelugunews.com ను ఫాలో కండి. ప్రమోట్ చేయండి)