తిరుమలకు కొండకు టెర్రర్ అలెర్ట్, నిఘా పెంపు

దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రవాద ముప్పు ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్‌ సంస్థలు చేసిన  హ్చెరికల నేపథ్యంలో తిరుమలకొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల(టిటిడి) వినతి మేరకు ఆక్టోపస్‌ రంగంలోకి దిగింది.
తిరుమలపై సుమారు 40 మంది కమాండోలు నిఘా పెంచారు. శేషాచలంపై అణువణువు జల్లెడ పడుతున్నారు. తమిళనాడు లోని కోయంబత్తూరు లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై గతంలో చాలాసార్లు ఐబీ హెచ్చరికలు వచ్చాయి. ఉగ్ర టార్గెట్ లో ఉందన్న సమాచారంతో దక్షిణాదిలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, దక్షిణాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా వాళ్ళు దాడులకు తెగబడే అవకాశాలున్నాయని ఆర్మీ ఇంటెలిజెన్స్‌  ఆ మధ్య హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఆ హెచ్చరిక ఇదే
దక్షిణ భారతదేశంలో టెర్రరిస్టు దాడి జరిగే అవకాశ ఉందని భారత సైనిక దళాలు అనుమానిస్తున్నాయి. భారత సైన్యం సదరన్ కమాండ్  అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎస్ కె సైనీ ఈ అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణభారతదేశంలో టెర్రరిస్టు దాడి జరిగ వచ్చని, దీనికి సంబంధించిన తమ దగ్గిర సమాచారం ఉందని లెఫ్టినెంట్ జనరల్ సైనీ చెప్పారు. సర్ క్రీక్ ప్రాంతంలో ఎవరో వదిలేసి పోయిన కొన్ని పడవలు దొరికాయని వాటిని స్వాదీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. టెర్రిరస్టు దాడులు, విచ్ఛిన్న కర శక్తుల కుట్రలు సాగకుండా తాము అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. దీనిని తర్వాతే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు దక్షిణాది రాష్ట్రాలకు టెర్రర్ అలెర్ట్  ప్రకటించాయి.