కులం, మతం వద్దంటే ఎంత చిక్కో, హర్యాన రవికుమార్ కష్టాలు…

హర్యానాకు చెందిన రవికుమార్ (33).కుల, మత వివక్షకు గురయి కులాన్ని మతాన్ని వదులుకోవాలనుకున్నాడు. మామూలుగా వదులుకోవడం కాదు,చట్ట ప్రకారం తాను కులాతీతుడినని, మతాతీతుడిని,తనకు దేవుడూ దైవం వద్దని గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. అదంత ఈజీ కాదని ఆయన అనుభవం చెబుతుంది. ఇచ్చిన సర్టిఫికెట్ను వాపసు తీసుకుంటామంటున్నారు జిల్లా అధికారులు. కుదరదు, న్యాయపోరాటం చేస్తానంటున్నాడు రవికుమార్ నాస్తిక్.
భారతదేశంలో కులం, మత సర్టిఫికేట్లు జారీచేస్తున్నారు గాని, కులం లేదని,మతం లేదని సర్టిపికేట్ల్లు ఇచ్చిన సందర్బాలు లేవు. చాలా మంది జీవితంలో కులాన్ని మతాన్ని త్యజించి, జీవిస్తూ ఉండటం మనకు తెలుసు. అదే విధంగా దేవుడు లేడనే నాస్తికులు కూడా మన చుట్టుఉన్నారు. అయితే, వీళ్లకి ప్రభుత్వం ఇలా సర్టిఫికెట్లు ఇచ్చిన చరిత్రలేదు.  కుల,మత సర్టిఫికేట్ ఇచ్చినట్లే తనకు ‘కులం లేదు, మతం లేదు’ అనే సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని రవికుమార్ అధికారులను ఆశ్రయించాడు.

హర్యానా ఫతేహాబాద్ జిల్లాలోని తోహానాకు చెందిన వాడు రవికుమార్. అతని విజ్ఞప్తి మీద అధికారలు అన్ని విధాల దర్యాప్తు చేసి అతను ఎక్కడా  కులం, మతం వాడుకోవడం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఏప్రిల్ 29వ తేదీన అధికారులు ’నో క్యాస్ట్, నో రిలిజియన్,నో గాడ్ ’ (no caste, no religion, no god) సర్టిఫికేట్ ఇచ్చారు.
అంటే రవికుమార్ నాస్తికుడని అధికారికంగా గుర్తింపు పొందాడు. ఇంతవరకు అది ఆయన చేతిమీద పచ్చబొట్టుగా మాత్రమే ఉండింది.
అయితే,వారం రోజులు తిరిగాక అధికారులు యు టర్న్ తీసుకున్నారు. ‘నో క్యాస్ట్ నో రిలిజియన్, నోగాడ్’ సర్టిఫికేట్ వాపసుతీసుకుంటున్నామని చెప్పారు. ఈ సర్టిఫికేట్ జారీ చేయడంలో తాలూకాధికారులు తమ పరిధి మించి చర్యలు తీసుకున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘నాస్తికుడు’ (Atheist)అని తన పేరుకు తగిలించుకుని సర్టిఫికేట్లు పొందేందుకు రవికుమార్ ను అనుమతించాలని కోర్టు ఆదేశించింది నిజమే గాని,  తాలుకాఫీసు వారు ఆదనపు రిమార్కులతో ఏకంగా సర్టిఫికేట్ జారీ చేశారు. వాళ్ల తమ పరిథి దాటారు,’ అని డిప్యూ కమిషన్ ధీరేంద్ర ఖడ్గాట టైమ్స్ కు చెప్పారు.
దీనిని రవికుమార్ అంగీకరించడం లేదు. ఎందుకంటే తనకు ఇలాంటి సర్టిఫికేట్ కావాలని అడిగినపుడు తాలూకాఫీసు వారు తిరస్కరించారని, అపుడే తాను డిప్యూటి కమిషనర్ ను ఆశ్రయించానని చెబుతూ తన గతం విచారించాక సర్టిఫికేట్ జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్ తాలూకాఫీసు వారిని ఆదేశించారని రవి చెబుతున్నాడు. తనకిచ్చిన సర్టిఫికేట్ ను కాపాడుకునేందుకు  తాను మరొక సారి న్యాయపోరాటంచేస్తానని అంటున్నాడు.
ఎందుకు కులాన్ని మతాన్ని త్యజించాడు…
మతాన్ని, దేవుడిని త్యజించి నాస్తికుడని పేరుకు తగిలించుకోవడంతో రవికి చాలా కష్టాలొస్తున్నాయి. ఆయన ఒక వెటర్నరీ ఆసుప్రతిలో పనిచేసేవాడు.అయితే, అక్కడ పశువులు జబ్బు పడి చనిపోయాయి. ఆ ప్రాంతంలో జాట్ లు ఎక్కువ. పశువులు చనిపోయేందుకు నాస్తికుడు పనిచేస్తూ ఉండటమే అని నింద వేసి క్యాజువల్ వర్కర్ రవి ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా సరే జంకకుండా తాను నిరుద్యోగిగా ఇంటికొచ్చానని  ఆయన ది ప్రింట్ కు చెప్పారు.
నాస్తికుడని ముద్ర వేసుకున్నాక తనకు కష్టాలు ఎక్కువయ్యాయని, తన అందిస్తే నీళ్లు కూడా తాగడం లేదని రవి చెబుతున్నాడు. అయినా సరే నాస్తికుడిగా ఉండిపోవాలనుకుంటున్నాడు. దీని వెనక చిన్నప్పటి నుంచి తాను అనుభవించిన కుల వివక్ష, మత వివక్ష ఉన్నాయని ఆయన చెబుతున్నాడు.
నాలుగు సంవత్సరాల వయసపుడే నాస్తికానికి అతని జీవితంలో బీజాలుపడ్డాయి. వాళ్లకుటుంబానికి, పొరుగు వారితో గొడవవచ్చింది.అపుడు అంతా పిల్లవాడిని గొట్టడం మొదలు పెట్టారు. పెద్దవాళ్లు చెప్పినట్లే, కాపాడాలని దేవుడిని కోరాను. దేవుడురాలేదు. తన్నులు తప్పలేదు.
తర్వాత దీపావళి వచ్చింది. ‘ పండగరోజు తలుపులు తెరచి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని చెప్పారు. నేను ఆరోజు తలుపులు బార్లా తెరిచి రాత్రంతా చూస్తూకుర్చున్నాను. లక్ష్మీదేవి రాలేదు. ఒక ఎలుక మాత్రం ఇంట్లోదూరింది,’ అని రవికుమార్ చెప్పాడు.
దీనికంటే వూర్లో తమ కుటుంబం మీద చూపిన కుల వివక్ష తాను కులం వదిలేసుకునేందుకు కారణమని ఆయన చెబుతున్నాడు. స్కూలులో కులానికి ఉన్న ప్రాముఖ్యం ఇతర కులాల మీద వివక్ష చూశాను. కులం లేకుంటే ఎంత బాగుండు అనుకున్నాను. ఈ క్రమంలో  షహీద్ భగత్ సింగ్ కు కూడా కులం లేదని తెలుసుకున్నాను.దీనితో  నాపేరుకు చివర నాస్తిక్ అని తగిలించుకునేందుకు అనుమతినీయాలని 2017లో లోవర్ కోర్టులో పిటిషన్ వేశాను. కోర్టు అంగీకరించింది. 2018 జనవరిలో పేరు చివర (రవి కుమార్ నాస్తిక్ ) అని పెట్టుకునేందుకు అంగీకరించింది.
ఈ ఉత్తర్వుల అధారంగానే తనకు క్యాస్ట్ లెస్ రిలిజియన్ లెస్ గాడ్ లెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని తాహశీల్దార్ ని కోరాను. సర్టిఫికెట్ ఇచ్చారు. ఇపుడు వాపసుతీసుకుంటానంటే ఎట్లా అని ఆయన అడుగుతున్నారు. దీని మీద న్యాయ పోరాటం చేస్తానంటున్నారు.

కులం లేదు, మతం లేదు మొదటి సర్టిఫికెట్…

 

కులం లేద, మతం లేద (no religion , no caste) సర్టిఫికేట్ రవికుమార్ కు రావడం మొదటి సారి కాదు. మీడియా రిపోర్టుల ప్రకారం, మొదటి సర్టిఫికేట్ తమిళనాడులో జారిచేశారు. మొదటి సర్టిఫికేట్ పొందిన గుర్తింపు తిరుపుత్తూర్ కు చెందిన లాయర్ స్నేహకు దక్కింది. స్నేహ వయసు 35 సంవత్సరాలు. వృత్తి న్యాయవాది. అమెకు కు కులం లేద, మతం లేదు. ఈ సర్టిఫికేట్ పొందేందుకు ఆమె కూడా సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. అది ఫలించి 2019 ఫిబ్రవరి 5 న ఆమెకు తిరుపుత్తూరు తాహశీల్దార్ టిఎస్ సత్యమూర్తినుంచి no caste,no religion సర్టిఫికేట్ పొందారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/laugh-is-free-share-with-all/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *