జగన్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా జర్నలిస్టు

మాజీ జర్నలిస్టు జీవీడీ కృష్ణ మోహన్ ని ప్రభుత్వ సలహాదారు(కమ్యునికేషన్స్)నిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
జీవీడీ గురించి క్లుప్తంగా..
– జీవీడి… గత 9 ఏళ్ళుగా వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేతకు సలహాదారుగా ఉన్నారు.
– ఈనాడులో జర్నలిస్టు జీవితం  ప్రారంభించారు.  అంతర్జాతీయ అంశాలు, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాల పై బాగా పట్టున్న వ్యక్తి. ఈ అంశాలపై ఎడిటోరియల్ పేజీలో కాలమ్స్ రాస్తూ వచ్చారు. ఈటీవీలో మావోయిస్జు నాయకుడు ఆర్కే(అక్కిరాజు హరగోపాల్- రామకృష్ణ)తో ముఖాముఖి చేసి ఆయన ఎంతో పేరుగడించారు.
– ఆ తర్వాత సాక్షి ఆవిర్భావ సమయంలో ఆ పత్రికలో చేరారు. అనతి కాలంలోనే ‘ఏది నిజం..’ ద్వారా వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన అవినీతిని బయటపెడుతూ వచ్చారు.
– అప్పడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి, అనంతరం జగన్ కు, ఇపుడు   ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరై సలహాలిస్తూ వస్తున్నారు.  అప్పటి నుంచి నేటి వరకూ ప్రతి కష్టంలో నష్టంలో వైయస్ఆర్  కుటుంబం వెంట నడిచిన వ్యక్తి గా ఆయన కు పేరుంది.
– మీడియాలో వైసిపి పార్టీ వాణిని సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించేందుకు ఎందరికో తర్ఫీదు ఇచ్చారని చెబుతారు.
– పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఆయన వెన్నంటే ఉన్నారు.

Advisor GO-convertedAdvisor GO-converted