భారతీయ బంగారం గురించి 13 ఆసక్తికరమయిన సత్యాలు

బారతీయులకు బంగారానికి ఉన్న అనుబంధ భావోద్వేగంతో కూడుకున్నది.
పాశ్చాత్య దేశాలలో బంగారాన్ని పెట్టుబడి రూపంగా చూస్తారుతప్ప దానికి మావనగుణాలు అపాదించరు.ప్రాచీన సంస్కృతుల లక్షణం ఇది.
కానీ, భారత దేశంలో బంగారు సంస్కృతిలో భాగం. ప్రతిఇంటాఎంతో కొంత బంగారం ఉంటుంది. జీవితంలో ఎపుడయినా సరే కాసంత బంగారం కొనాలన్న కాంక్ష ఉండని భారతీయులుండరు.
నాలుగుడబ్బులు పోగేసుకున్నపుడల్లా భారతీయ స్త్రీలు మురిపెంగా కొని దాచుకునేది బంగారాన్నే.
అందుకే మొన్న బడ్జెట్లో 2.5 శాతం బంగారు దిగుమతి సుంకం పెంచడం చాలా మందికి నచ్చలేదు. ఇది కులాలు, మతాలతో సంబంధం లేకుండా చాలా మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది.
ధరలు పెరిగినా బంగారం కొనడం మానేస్తారా? మానేయరు.ఎందుకంటే,బంగారు పెట్టబడిగా కాదు,సంస్కృతిలో భాగంగా చూస్తారు.
ఇది కూడా చదవండి: శుభవార్త, ఎర్రమంజిల్ హైకోర్టు అండ, ఎలా కూలుస్తారని ప్రశ్న
బంగారును మానవీకరించి పూజించడం, ప్రేమించడం భారత దేశంలో ఉంది. బంగారు తల్లి అనే మాట వచ్చింది బంగారుకు భారతీయులు ఆపాదించిన మహత్తర గుణం వల్లే. మంచివాడిని బంగారంలాంటి వాడిగాపిలవడం మనం రోజూ చేస్తున్నదే. మంచి కాలాన్ని స్వర్ణయుగం అంటారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించింది కూడా బంగారు తెలంగాణ ఏర్పాటుచేస్తామనే. వజ్రాల తెలంగాణ అనలేదు.
బంగారం కంటే ఎంతో విలువయినా ప్లాటినానికి,వజ్రాలకు ఈ హోదా రాలేదు, ఒక్క బంగారానికి అందరి మనుసుదోచుకున్నది. ఇంత ఆత్మీయంగా చూసుకుంటున్నందునే బంగారు ధర పెరిగినపుడల్లా చాలామంది ఆందోళన గురవుతారు.
 ఎందుకంటే తులమో కాసో బంగారు కొని చేసి పెళ్లిళ్లుంటాయి. కానుకలివ్వాల్సిన సంబరాలుంటాయి. అవి భారమవుతాయి.
చాలామంది బంగారు మార్కెట్ పండితులు నిర్మలా సీతారామన్ తీసుకున్న చర్యను అంగీకరించకపోవడానికి కారణం ఇదే. బడ్జెట్ లో బాగా లేని అంశాలలో ఇదొకటి అన్నారు.
బడ్జెట్ తర్వాత బంగారు ధరల పదిగ్రాములు రు.35 వేలు దిగిరావడమే లేదు.
ఇది కూడా చదవండి:లక్షన్నర కోట్లు విరాళమిచ్చి రిటైరవుతున్నవిప్రో అజిమ్ ప్రేమ్జీ
భారతీయుల బంగారు వ్యామోహం ఇప్పటి సంగతి కాదు, తరతరాలుగా వస్తన్న ఆచారం. భారరతీయు జీవితం  విడదీయలేనంతగా  బంగారంతో పెనవేసుకుని పోయింది.బంగారు లేని వెలితి బాధిస్తూ ఉంటుంది.
బంగారం దాచుకోవడంతో భారతీయుల ఇళ్లకు కళ వస్తుంది. అందుకే భారతీయు ఇళ్లలో ఉన్నంత బంగారం ప్రపంచంలో ఏదేశంలో లేదు.
అందుకే చరిత్ర పొడవునా బంగారు ఎగుమతి భారతదేశానికి ఎక్కువ జరిగేది.దేశంలో బంగారు పెద్దగా లేకపోయినా, ప్రపంచ బంగారు గమ్యం భారతదేశమే.
ఏ సాంప్రదాయిక కార్యక్రమానికి వెళ్లినా అక్కడ మహిళలంతా బంగారు నగులు ధరించి కనబడతారు. ఈ బంగారంలో తరతరాలుగా వచ్చిన బంగారమూ ఉంటుంది, కొత్త గా కొన్నది ఉంటుంది.
భారతీయుల దగ్గిర ఉన్న బంగారు నిల్వలుచూసి  భారతీయులంతా బంగారాన్ని కొన్ని మూలనపడేస్తున్నారని,  విలువయిన సంపద ఇలామార్కెట్ లోకి రాకుండా వృధా అయిపోతున్నదని పాశ్చాత్యులు గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఇందులో కొంత వాస్తవమున్నా, భారతీయులు పెట్టబడిగా బంగారు కొనడంకంటే సాంస్కృతికంగా బంగారు కొని దాచుకుంటారు. భారతదేశానికి సంబంధించిన బంగారు లెక్కలివిగో…
1. ప్రపంచంలోని మొత్తం బంగారులో 11 శాతం భారతీయ గృహాలలోనే ఉంది.
2. తూకంలో ఇది దాదాపు 24,000 వేల టన్నుల దాకా ఉంటుందని చెబుతారు. దీని విలువ $1 ట్రిలియన్
3. ఇది భారతీయ రిజర్వు బ్యాంకు దగ్గిర ఉన్న బంగారు నిల్వల చాలా చాలా చాల ఎక్కువ.
4. రిజర్వు బ్యాంకు దగ్గిర ఉన్నది కేవలం 612.6 టన్నులే. ఈ మధ్యే బ్యాంకు 51.3 టన్నుల గోల్డ్ కొనుగోలు చేసి తన దగ్గిర నిల్వలను పెంచుకుంది. రిజర్వు బ్యాంకు దగ్గిర ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం నిల్వలలో బంగారం వాట 6.1 శాతం.
5. అమెరికా సెంట్రల్ బ్యాంక్ దగ్గిర ఉన్న బంగారు నిల్వలు 8133 టన్నులకు అటు ఇటుగా ఉంటుంది.ఈ బ్యాంకుకు ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలున్న బ్యాంకుగా పేరొచ్చింది దీని వల్లే. 3,368 టన్నుల నిల్వలతో జర్మనీది రెండో స్థానం. ఇక ఐఎంఎఫ్ దగ్గిర 2,814 టన్నుల బంగారం ఉంది.
6. బంగారు నిల్వలలో భారతీయ రిజర్వు బ్యాంకుది పదో స్థానం.
7. భారత దేశంలోని వివిధ దేవాలయాలలో 4000 టన్నుల కంటే ఎక్కువగానే బంగారం ఉంటుందని అంచనా.
8. కేరళ పద్మనాభ స్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబల దగ్గిరే సుమారు రు. లక్ష కోట్ల విలువయిన బంగారు ఉందని అంచనా.
9. భారతదేశంలో ఎక్కువ బంగారు కొనుగోలు చేసే రాష్ట్రం కేరళ. కేరళ తలసరి బంగారం కొనుగోళ్లు మిగతా రాష్ట్రాలకంటే ఆరింతలు ఎక్కువ.
10. గ్రామీణ ప్రాంతాలలలో కొనుగోళ్లు తీసుకున్నా, అర్బన్ ఏరియాస్ తీసుకున్నా బంగారం కొనేవాళ్లు కేరళలోనే ఎక్కువ. అందుకే నేమో చాలా జ్యుయలరీస్ కేరళ వాళ్లే. రెండో స్థానం గోవాది.
11. 2017-2018 భారతదేశం మైనింగ్ చేసిన బంగారు కేవలం 1.61 టన్నులే. శాస్త్రవేత్తలు చూపిస్తున్న నిల్వలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదే కాలంలో ఆస్ట్రేలియా 300 టన్నులు ఉత్పత్తి చేసింది.
12. 1994 లో  ఇండియా రెండుటన్నుల బంగారు ఉత్పత్తి చేసింది. అపుడు చైనా చేసింది మూడు టన్నులే. ఇపుడు ఇండియా రెండు టన్నులు మించడం లేదు. చైనా ఉత్పత్తి 450 టన్నులు.
13. భారతదేశంలో బంగారు వ్యాపారంలో ఉన్న వాళ్ల సంఖ్య మూడు లక్షల మంది దాకా ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ఇళ్ల నుంచి పనిచేసే వారే.
(ఈ వ్యాసం మీకు నచ్చితే షేర్ చేయండి.trendingtelugunews.com ను ఫాలో కండి)