గోవా ముఖ్యమంత్రి పర్రీకర్ మృతి

గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీలో ఉన్న నికార్సయిన నాయకుడు మనోహర్ పర్రీకర్ చనిపోయారు. పాంక్రియాటిక్ కాన్సర్ తో సుదీర్ఘ కాలం పోరాటం చేసి ఆయన ఈ రోజు తనువు చాలించారు. ఆయన వయసు 63 సంవ్సరాలు. గోవాముఖ్యమంత్రిగా ఉన్నా, రక్షణ మంత్రిగా ఉన్న ప్రశంసలందుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆయన గోవా అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమించేవారు.

మార్చి 18న జాతీయ సంతాప దినంగా కేంద్రం ప్రకటించింది. పర్రీకర్ కు పూర్తి అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఆయన రాజకీయ జీవితం ఆర్ ఎస్ ఎస్ తో మొదలయింది. ప్రచారక్ మొదలయి ఆయన రాజకీయ ప్రస్థానం భారత రక్షణ మంత్రి అయ్యేదాకా సాగింది. తర్వాత ఆయనను ఎవో అంతుబట్టని కారణాలతో గోవా ముఖ్యమంత్రిగా పంపించారు.ఆయన రక్షణ మంత్రిగా ఉన్నపుడు భారతదేశం మొదటి సర్జికల్ స్రయిక్స్ విజయవంతంగా జరిపింది. పర్రీకర్ఖ ముంబై ఐఐటి లో ఇంజనీరింగ్ చదవారు. గోవాలోని మాండవి నదిమీద నిర్మించిన అటల్ సేతు ఆయన రూపకల్పన చేసిందే.

గోవాలో అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కొంతవరకు విజయవంతమయ్యారు.ఆయన నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అక్రమ మైనింగ్ మీద సమర్పించిన నివేదిక సంచలనం సృష్టించింది. చివరకు దాని మీద ఎమ్ బి షా కమిషన్ వేసి రాష్ట్రంలో ఇనుప ఖనిజం దోపిడీ మీద దర్యాప్తు చేయించాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని, ఆయన బొమ్మతోనే ఎన్నికలకు వెళ్లాలని 2013 లో చెప్పిన మొదటి బిజెపి ముఖ్యమంత్రి ఆయనే.


ఆయన నిజాయితీని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. అందుకే మరణానికి అంతా సమంగా సంతాపం తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *