చంద్రబాబూ, ఇక చాల్లే తప్పుకో : మోత్కుపల్లికి ఆగ్రహం

మాజీ టిడిపి మంత్రి, తెలంగాణ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మీద చాలా కోపం వచ్చింది. ఈ రోజు  ఎన్నికల ఫలితాల మీద స్పందిస్తూ, ఇక రాజకీయాలనుంచి తప్పుకో అని సలహా ఇచ్చారు. అంతేకాదు, ఈ పార్టీ ఎవరికి చెందిందో వాళ్లకిచ్చేయమన్నారు.

ఆయన ఏమన్నారంటే…

‘నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయి. తెలుగుదేశం జెండా నీది కాదు.. నందమూరి వాళ్ళ జెండా. ఇక సెలవు తీసుకో.. నువ్వు పెద్ద కొడుకువి కాదు.. పెద్ద తాతవు.. పెద్ద కొడుకు అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి : మోత్కుపల్లి ఆగ్రహం,’ అని ఆగ్రహంగా సలహా ఇచ్చారు.

ఇంకా ఏమన్నారో చూడండి:

ఏపీలో జగన్ గెలుపొందినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది.

ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరింది.

దశమగ్రహం అంతరించి పోయినందుకు సంతోషంగా ఉంది

నరరూప రాక్షసుడు అంతరించిపోయినందుకు ఆనందంగా ఉంది.

ఏపీ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలైన రోజు.

చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపినందుకు జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నా.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తరువాత ఈ దుర్మార్గుడు సీఎంగా ఉండొదద్దని కోరుకున్నాడు.

చంద్రబాబు దొంగ, ప్రజాద్రోహి. నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టింది.

ఎవరైన వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి ఉన్న వ్యక్తి చంద్రబాబు.

నేను ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయల్లోకి వచ్చా.

చంద్రబాబు ఇంటి దగ్గర కాపలాగా కుక్కలా ఉన్న నన్ను మోసం చేశారు.

రాజ్యసభ సీట్లు ఒక్కొక్క టి వంద కోట్ల కు అమ్ముకున్నారు.

నాకు గవర్నర్, రాజ్యసభ పదవీ ఇస్తానని చెప్పారు.

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి విజయవాడకు పారిపోయారు.

తెలంగాణలో పార్టీని బతికించు కుండామని అన్నందుకు నన్ను పార్టీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారు.

తెలంగాణలో ప్రజలు చంద్రబాబు ను తరిమి కొట్టారు… ఏపీ ప్రజలు కూడా తన్ని తరిమి కొట్టారు.

కేంద్రంలో చక్రం తిప్పుతా అన్నావ్… అది పిప్పర్ మెంట్ చక్రం.

ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నాశనం చేశావు.

దళితులకు అన్యాయం చేశావ్.. మాలమాదిగలకు మధ్య కొట్లాట పెట్టావ్.. వాళ్ళ ఉసురు తగిలి పోయావ్.

తప్పులు సర్దిది డ్డుకున్నోడే లీడర్.. తప్పుల మీద తప్పులు చేసే వాడు నాయకుడు కాదు.

నరరూప రాక్షసుడు అంతం అయినందుకు తెలుగు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు.

3500 తిరుపతి మెట్లు ఎక్కి దేవున్ని దర్శించుకున్నాను. చంద్రబాబును ఓడించాలని వెంకటేశ్వరస్వామిని మొక్కు కున్న. నా మొక్కు ఫలించింది.

ఎన్టీఆర్ వంటి మహానుభావున్నీ బలిచేశావ్.

పాపాల పుట్ట చంద్రబాబు.

జగన్, జనం నిన్ను ఫుట్ బాల్ ఆడుకున్నారు.

నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయి…

తెలుగుదేశం జెండా నీది కాదు.. నందమూరి వాళ్ళ జెండా

చంద్రబాబు ఇక సెలవు తీసుకో.. నువ్వు పెద్ద కొడుకువి కాదు.. పెద్ద తాతవు.. పెద్ద కొడుకు అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

జగన్ మొదటి క్యాబినెట్ మీటింగ్ లో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని తీర్మానం చేస్తే ఆయన అభిమానులు, ప్రజలు సంతోషపడతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *