మాజీ క్రికెట్ స్టార్ చంద్రశేఖర్ ఆత్మహత్య

ఒకప్పటికి క్రికెట్ స్టార్ విబి గా బాగా పాపులర్ అయిన క్రికెటర్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని  మైలాపూర్ నివాసంలో ఆయన వురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
గురువారం నాడు ఆయన నార్మల్ గానే ఉన్నారు.
సాయంకాలం అయిదుగంటలకు ఆయన కుటుంబ సభ్యులతో కలసి టీ తాగారు.తర్వాత తన బెడ్ రూంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం ఆయన బెడ్ రూమ్ నుంచి బయకుట రాకపోవడంతో భార్య సౌమ్య తలుపులుతెరిచే ప్రయత్నం చేశారు. తలుపులు తెరుచుకోలేదు. ఆమె తలుపు కన్నంలో నుంచి చూస్తే ఆయన వురేసుకున్నట్లు కనిపించడంతో ఆమె పోలీసులకు తెలియచేశారు.
బిజినెస్ లో భారీ నష్టాలు రావడం వల్ల ఆయన ఈచర్య కు పాల్పడ్డారని అనుకుంటున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNL)లో ఆయన భారీగా ఇన్వెస్ట్ చేశారు. అదే విధంగా ఆయన కాంచీపురం క్రికెట్ టీమ్ ను మేనేజ్ చేస్తున్నారు.అయితే, ఈ మధ్య ఆయన బారీగా నష్టపోయారని దానితో ఆయన బాగా దిగాలుగా ఉన్నారని సౌమ్య చెప్పారు.
తమిళనాడు నుంచి వచ్చిన మేటి క్రికెటర్ ఆయన. 1987-88లో తమిళనాడు రంజీ విజయంలో ఆయన కీలక పాత్ర వుంది. క్రికెట్ నుంచి రిటైరయ్యాక నేషనల్ సెలెక్షన్ కమిటీలో సౌత్ జోన్ ప్రతినిధిగా ఉన్నారు. తమిళనాడు రంజీకి కోచ్ గా కూడా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ మేనేజర్ గా కూడా పనిచేశారు,