జర్నలిస్టు దీక్షితులు మృతి

ఆంధ్రప్రభ దిన పత్రిక పూర్వ సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా వ్యవహరించిన వి.వి.వాసుదేవ దీక్షితులు  ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లో మృతి చెందారు.

ఆయన వయసు 76 సం. వారికి భార్య, వివాహితులైన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

సికింద్రాబాద్ లోనిఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

సికింద్రాబాద్ కల్యాణ పురిలో (సైనిక పురి పక్కన) వారి స్వగృహానికి వారి భౌతిక కాయాన్ని మరికొద్ది సేపటిలో తరలిస్తారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేసేరు.

సంపాదకులలో దీక్షితులుది ఒక విశిష్టమయిన శైలి. ఆయన కవిత్వం అందునా అజంతా కవిత్వమంటేప్రాణం.సంపాదకీయాలను చాలా వరకు అజంతా కవితా మలిచే ప్రయత్నం చేసేవారు. మంచిచదవరి.విజ్ఞానవంతులయిన ఎడిటర్ల తరానికి చెందిన వారాయన. జర్నలిజం డిజిటల్ వైపు మరలుతూ ఉంది. ఎది వార్తలో  అవార్తతో, ఏది వాస్తవమో, అవాస్తవమో తెలియని యుగంలోకి జర్నలిజం అడుగుపెట్టింది.  అంతరించిపోతున్న పాత తరం జర్నలిజం ప్రతినిధుల్లో ఆయన ఒకరు. ఆయన లేని లోటు తీర్చలేనిది. చివర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనను ప్రెస్ అకాడమీ ఛెయిర్మన్ గానియమించినా చాలా కాలం ఆయనకు కార్యాలయం కూడా లేదు.

కల్యాణ పురిలో వారి అడ్రస్:
5-9-48/3/1, plot no. 71, Raghav Kalyan Eststes, JJ Nagar Post Office, Secunderabad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *