తొలిసారి మంగళగిరి ప్రత్యర్థులు ఆర్ కె, లోకేష్ కరచాలనం…

మొన్న జరిగిన అంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దాకా బాగా ఉత్కంఠ రేకెత్తించిన నియోజకవర్గం మంగళగిరి.

ఎందుకంటే, అక్కడ కాబోయే ముఖ్యమంత్రి అని పేరువడిన తెలుగుదేశం జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ అసెంబ్లీలో ప్రవేశించేందుకు పోటీచేస్తుండటమే.  ఆయన మీద వైసిపి తరఫున ఆళ్ల రామకృష్ణ రెడ్డి అనే రైతు పోటీ చేశారు.

ఈ ఎన్నిక మీద భారీ గా బెట్టింగ్ కూడా జరిగిందని చెబుతారు. లోకేష్ చంద్రబాబు కుమారుడిగా చాలా పాపులర్. దానికి తోడు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం. ఆయన మీద సాధారణ వ్యక్తి పోటీ. అయితే, సాధారణ వ్యక్తే కాని, మంగళగిరిలో ఆళ్ల కు మంచిన పాపులర్ పొలిటిషన్ లేడు. ఆయన లోకల్. తన పనుల ద్వారా,  సాదాసీదా జీవితం ద్వారా,  చంద్రబాబు ప్రభుత్వంలోసాగుతున్న ‘అవినీతి’కి వ్యతిరేకంగా సాగించిన కోర్టు పోరాటం ద్వారా ఆళ్ల చాలా పేరు పొందారు.

చివరకు సంచలనం సృష్టిస్తూ ఆళ్ల గెలిచాడు. జెయింట్ కిల్లర్ అయ్యాడు. లోకేష్ ఓడిపోయాడు. అయితే, లోకేష్ ఎమ్మెల్సీ కాబట్టి అదే పదవిలో కొనసాగుతారు.

అయితే వాళ్లిద్దరు ఎపుడూ ఎదురుపడి పల్కరించుకున్న దాఖలా లేదు.

ఈ రోజు తొలిసారిగా వారు అసెంబ్లీ లో ఒకరికొకరు తారసపడ్డారు. కరచాలనం చేసుకున్నారు. మర్యాదగా, గౌరపూర్వకంగా పల్కరించుకున్నారు. ఈ అరుదైన సన్నివేశం ఫోటోనే ఇది.